మరి కాసేపట్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ అత్యవసర భేటీ కానుంది. నాలుగు జిల్లాల్లో వరదల పరిస్థితి ఉన్న నేపథ్యం లో అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలా వద్దా అనే అంశంపై మంత్రి మండలి సమావేశం కానున్నట్లు సమాచారం అందుతోంది. అంతే కాదు.. మూడు రాజధానుల అంశం పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ క్యాబినెట్ అత్యవసర భేటీ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.
అత్య వసర క్యాబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని విస్తృత ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న బిల్లు ను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. కొన్ని మార్పుల తో కొత్త గా మళ్లీ శాసన సభ లో మూడు రాజధానుల బిల్లు పెట్టే ఆలోచన లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అంతే కాదు.. వరదల కారణంగా నష్టపోయిన వారిని ఎలా ఆదు కోవాలనే దానిపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది.