జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డికి సీఎంవో నుంచి పిలుపు..!

-

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డికి సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. దింతో రేపు సీఎంవో కార్యాలయానికి రావాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఇద్దరు నేతలకు ఆదేశాలు వచ్చాయి.

Call from CMO to JC Prabhakar Reddy and Adinarayana Reddy

గత మూడు రోజులుగా ఇద్దరి నేతల మధ్య ఫ్లైయాష్ వివాదం రగులుతోంది. నేడు సీఎం కుప్పం పర్యటనలో ఉన్న నేపథ్యంలో రేపు రావాలని ఆదేశాలు ఇచ్చారట. కాగా నిన్న ఇరు పార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు… ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు సిఎం చంద్రబాబు. మొత్తం ఘటన పై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు సీఎం చంద్రబాబు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version