తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది మహిళా మంత్రి సీతక్క. త్వరలోనే దివ్యాంగులకు పెంచుతామని ఆమె ప్రకటించారు. ఎన్నికల హామీలో మూడువేల దివ్యాంగుల పెన్షన్ను 6000 కు పెంచుతామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది కాలమైన కూడా దానిపై ఇప్పటివరకు ప్రకటన రాలేదు.
కానీ ఇలాంటి నేపథ్యంలో… తాజాగా దివ్యాంగుల కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క…. త్వరలోనే దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామని ప్రకటించడం.. జరిగింది. అయితే ఎప్పుడు పెంచుతాం… అనే డేట్ మాత్రం ఖరారు చేయలేదు. మొత్తానికి సీతక్క చేసిన ప్రకటనతో దివ్యాంగులు సంబరపడిపోతుంది.
అటు నేటి నుంచి మహబూబ్ నగర్లో ‘రైతు పండగ’ జరుగనుంది. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా నేటి నుంచి మహబూబ్ నగర్లో ‘రైతు పండగ’ జరుగనుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, పంట ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు జరుగనున్నాయి.