అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు ఫూలే విగ్రహం పెట్టాలి : ఎమ్మెల్సీ కవిత

-

మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఘన నివాళ్లు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలు వేసి నమస్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో కులవివక్ష, అసమానతలు రూపుమాపడానికి అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త,మహిళా విద్యను ప్రోత్సహించిన మార్గదర్శి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పరితపించిన వ్యక్తి మహాత్మ జ్యోతి రావు పూలే అని కొనియాడారు.

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత గతంలోనూ ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమె జైలుకు వెళ్లే ముందు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version