ముఖ్యమంత్రి నేనా..? చంద్రబాబు నాయుడా…?

-

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యలు బాధ కలిగించాయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రమేష్ కుమార్ విచక్షణ కోల్పోయారని ఆరోపించారు. ఎవరైనా కరోనా వైరస్ ఉందని ఎన్నికలు వాయిదా వేస్తారా అని ప్రశ్నించారు. పక్షపాతం లేకుండా ఎన్నికల సంఘం వ్యవహరించాలని అన్నారు. ఎన్నికల కమీషనర్ గా రమేష్ కుమార్ ని చంద్రబాబు నియమించారని, సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించుకున్నారు అని, వైఎస్ జగన్ ఆరోపించారు.

కరోనా గురించి ఎన్నికలు వాయిదా వేస్తున్నామని అదే ప్రెస్ మీట్ లో పోలీసు అధికారులను తప్పిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన పార్టీ మాది అన్నారు జగన్. 151 సీట్లు వచ్చాయని తాము, అధికారంలో ఉన్నామని, ఎన్నికల సంఘానికి అధికారులను బదిలీ చేసే అధికారాలు ఎక్కడివి అని ప్రశ్నించారు. ఏదైనా అంటూ విచక్షణా అధికారమని అంటున్నారని, కొత్త పదాన్ని కనిపెట్టారని జగన్ ఆరోపించారు. వైసీపీ రెండు వేల ఎంపీటీసీలను స్వీప్ చేసిందని అది వాళ్లకు దుర్వార్త అయింది అంటూ ఆరోపించారు.

ఈ అధికారం రమేష్ కుమార్ దా, మాదా అని ప్రశ్నించారు. మా అభ్యర్ధులు ఏకగ్రీవం అవ్వడం తట్టుకోలేకపోయారని అన్నారు. ఎస్పీలను, కలెక్టర్ లను ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారని జగన్ మండిపడ్డారు. కనీసం ఆరోగ్య శాఖకి అయినా చెప్పాలి కదా అని ప్రశ్నించారు. ఆరోగ్య శాఖ అధికారికి గాని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అధికారికి గాని చెప్పలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారులను బదిలీ చేసే అధికారం నీకు ఎక్కడిది అని ప్రశ్నించారు. పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే వద్దని ఎందుకు చెప్పారని మండిపడ్డారు.

ఎవరో ఆర్డర్ రాస్తుంటే రమేష్ కుమార్ ఆ ఆర్డర్ చదువుతున్నారని అన్నారు. ఇంకా ప్రభుత్వాలు ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు, అన్నీ ఎన్నికల సంఘమే చేసుకోవచ్చు కదా అన్నారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరికి అయినా చెప్పాలి కదా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సమాచారం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అండ్ కో స్థానిక సంస్థల ఎన్నికలపై నానా యాగీ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నీకు ఆ పదవి ఇచ్చి ఉండవచ్చు, కాని ఇంత వివక్ష చూపించడం కరెక్ట్ ఏ నా అని ప్రశ్నించారు.

ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించాలి అని జగన్ సూచించారు. అసలు ఆ ఆర్డర్ తయారు చేస్తున్నట్టు కనీసం ఎవరికి సమాచారం లేదని అన్నారు. అసలు ఆ ఆర్డర్ కాపీ టైపు అవుతున్నట్టు, ఎన్నికల సంఘం సెక్రటరి కి కూడా దాని గురించి తెలియదని అన్నారు. 43 చోట్ల మాత్రమే చెదురు మొదురు ఘటనలు జరిగాయని జగన్ అన్నారు. మార్చ్ 31న ఈ ఎన్నికలు అయిపోతే 5 వేల కోట్ల నిధులు వస్తాయని, ఏదోక అభివృద్ధి జరుగుతుంది కదా అని జగన్ అన్నారు. పోలీసులను చూసి గర్వపడుతున్నామని అన్నారు. వ్యవస్థల్లో తనకు ఉన్న సంబంధాలను వాడుకుని ఎన్నికలను వాయిదా వేసారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news