దేశ వ్యాప్తంగా వలస కూలీలు పడుతున్న కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తినడానికి తిండి లేక ఎందరో అవస్థలు పడుతున్నారు. ఇక ఇతర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్ళిన మత్స్య కారుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు సముద్రంలో చిక్కుకుపోయారు. ఏపీ, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వారు గుజరాత్ సహా పలు రాష్ట్రాలకు వెళ్ళారు.
దీనితో ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో ఏపీ సిఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్ లో చిక్కుకున్న ఏపీ మత్య్సకారులను రప్పించేందుకు గాను ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేసారు. గుజరాత్ సిఎం విజయ్ రూపాని తో ఆయన రెండు రోజుల నుంచి ఫోన్ లో మాట్లాడుతున్నారు.
దీనితో స్పందించిన విజయ్ రూపాని… తాము మత్స్యకారులను ఎపీకి తరలించడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. దీనితో వారు అందరిని కూడా సముద్ర మార్గం ద్వారా ఎపీకి తీసుకుని రావాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళగా విజయ్ రూపాని కూడా అందుకు ఓకే చెప్పారు. అధికారులు దీనికి ఏర్పాట్లు చెయ్యాలని జగన్ ఆదేశాలు జారీ చేసారు.