ప్రస్తుతం ఏపీలో మునుపెన్నడూ చూడని విధంగా జగన్ మార్కు పాలన సాగుతుంది! పలానా సమస్య ఉందని అధికారులు చెప్పడం, జనం అడగడం ఆలస్యం.. దానిపై కూలంకషంగా చర్చించి, ఆ సమస్యకు శాస్వత పరిష్కారం చూపించే దిశగా జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రస్తుత ఈ ప్రజారంజక పాలనలో భాగంగా జగన్ సర్కార్ పింఛన్లకు సంబందించి అద్భుత నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. దీన్ని పక్కాగా అమలు చేస్తే మాత్రం జగన్ సర్కార్ గొప్ప సంస్కరణ తీసుకొచ్చినట్లే!
అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న ఐదురోజులకే పింఛన్ మంజూరు చేసే బృహత్తర పథకానికి జూన్ ఒకటి నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు జగన్ సర్కార్ తాజాగా ప్రకటించింది. ఎవరైనా పింఛన్ కు దరఖాస్తు చేస్తే వాటిని పరిశీలించి అర్హత ఉందని అధికారులు భావిస్తే కేవలం ఐదు రోజుల్లోనే వారిని అర్హులుగా ఎంపిక చేస్తారు. దీంతో… సామాన్య ప్రజలకు ఇది ఎంతో ఊరటనిచ్చే విధానమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు పింఛన్ కోసం మండల కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే బాధ ఈ కొత్త నిర్ణయంద్వారా తప్పుతుందనేది మరికొందరి అభిప్రాయం! ఎందుకంటే… ఈ నూతన ప్రక్రియకు సంబందించి… ఇంటి దగ్గరికే వచ్చి దరఖాస్తులు తీసుకోవడం మొదలుకుని తిరిగి మంజూరు పత్రాలు అందించే వరకూ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది!
కాగా… చంద్రబాబు పాలనలో కొత్తవాళ్లకి పింఛన్ రావాలంటే ఉన్నవాళ్లలో ఎవరు చస్తారా అని ఎదురు చూసే దుస్థితి! నేడు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు లేకుండా… జగన్ తీసుకున్న ఈ నిర్ణయం గొప్ప సంస్కరణ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త విధానం ప్రకారం… గ్రామ సచివాలయంలో దరఖాస్తు ప్రక్రియ మొదలై, తిరిగి సచివాలయాల ద్వారానే మంజూరు పత్రాలు అందజేస్తారు. ఈ ప్రక్రియలో ధరఖాస్తు దారులు చేయాల్సిందల్లా అర్హతకు సంబంధించిన ధృవీకరణ పత్రాలన్నీ సమర్పించడమే!