వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌పై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయగా.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశామని అన్నారు .వ్యవసాయానికి ఏకంగా రూ.72 వేల కోట్లు కేటాయించి కాంగ్రెస్ మరోసారి రైతు ప్రభుత్వమని నిరూపించుకుందని తెలిపారు.
కేసీఆర్‌ది ఊహల బడ్జెట్.. వాస్తవ బడ్జెట్ కాంగ్రెస్‌దని అన్నారు. కేసీఆర్ ఆలోచన అప్పుల మీద అయితే…. ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆలోచన రాష్ట్ర అభివృద్ధి అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌కు కాంగ్రెస్ భారీగా నిధులు కేటాయించిందని.. ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.10 వేల కోట్లతో హైదరాబాద్ దశ మారుతుందని ఆయన అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుంటే.. కేసీఆర్‌కి కుళ్లు ఎందుకని ఆయన మండిపడ్డారు.