కొన్ని దేవాలయాలకు కొన్ని రకాల ప్రత్యేకతలు ఉంటాయి. వాటిని చూడగానే మన కళ్ళు సైతం వాస్తవాలను నమ్మలేవు.అలాంటి ఎన్నో మహిమలు ఉన్న ఆలయాలు, కట్టడాలు ఈ భూమ్మీద లెక్క లేనన్ని ఉన్నాయి. మన దేశంలో ఎన్నో పురాతన, ప్రాచీన ఆలయాలు కూడా ఉన్నాయి. క్రీస్తూ పూర్వం నుంచి ఇప్పటివరకు ఉన్న అద్భుత కట్టడాలు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు టూరిజమ్ స్పాట్ లు మారాయి. అందులో ఒకటి జగన్నాథగట్టు ఆలయం. ఈ ఆలయానికి నిర్మాణం వెనుక చాలా పెద్ద కథే ఉంది అంటారు పూర్వీకులు. శివునికి ప్రసిద్ది చెందిన ఈ ఆలయం కర్నూలు లోని బి.తాండ్రపాడు లో ఉంది. పట్టణం నుండి నంద్యాల వెళ్ళే మార్గంలో జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల దాటగనే ఈ కొండకు దారి ఉంది.
ఈ ఆలయంలోని లింగానికి ఉన్న చరిత్రవల్ల ఈ ప్రాంతం ప్రాముఖ్యత పొందింది. ఈ ఆలయంలోని శివలింగాన్ని పాండవ రాజైన భీముడు తీసుకువచ్చాడని పురాణాల కథనం..కాగా, శివలింగం ఎత్తు 6 అడుగులు, వెడల్పు 2 అడుగులు.ఈ ఆలయానికి 1100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. సంగమేశ్వరాలయాలలోని రూపాల సంగమేశ్వరాలయం ఇక్కడికి తరలించడంతో, ఈ కొండ ప్రాధాన్యత సంతరించుకొంది. పూర్వం పాండవులు శ్రీశైలం వెళ్లే మార్గంలో సప్త నదుల సంగమం అని పిలువబడే సంగమేశ్వరంలో ధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్టించాలనుకుని.. శివలింగాన్ని తీసుకురమ్మని భీముడిని కాశీకి పంపుతాడు విగ్రహ ప్రతిష్టాపన ముహుర్త సమయానికి బీముడు రాకపోవడంతో. నిమ్మ చెట్టుతో ఒక శివలింగ ఆకృతిని చేసి ప్రతిష్టించాడని చరిత్ర చెబుతోంది.
తర్వాత కొద్ది దినాలకు భీముడు లింగాన్ని తీసుకు వచ్చాడు అప్పుడు ఆ లింగాన్ని ఆలయంలో ప్రతిష్టించారు.ఆలయం లోపల నటరాజ మూర్తులు ఆనంద తాండవం చేస్తున్న శివుని శిల్పాలు కొలువుదీరాయి. అదేవిదంగా ఆలయా గోపురానికి ఇరువైపులా చక్కటి శిల్పా కలలు అందరిని ఆకట్టుకుంటాయి. ఈ గుడికి వెళ్లేదారిలో బసవేశ్వరుడు , గుడి ఆవరణలో ఆదిశేషుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆలయంలో ప్రవేశించిగానే చుట్టూ చెట్లు పచ్చదనంతో ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా ఎన్నో ఆలయాలు ఇక్కడ కొలువై ఉన్నాయి..ప్రతి ఏటా శివ రాత్రికి ఈ దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు.. ఎప్పుడైనా శివరాత్రికి కర్నూలు వెళితే మాత్రం ఆ దేవాలయాన్ని తప్పక చూసి రండి..