వైసీపీ ప్లీనరీ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకూ సభ్యులు రిజిస్ట్రేషన్ ఉండగా.. 10 గంటల 10 నిమిషాలకు పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు అధ్యక్షుడు జగన్. 10 గంటల 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ప్రార్ధన ఉండగా.. 10 గంటల 30 నిమిషాలకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు.
అనంతరం సర్వమత ప్రార్థనలు, 10.55 నిమిషాలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటనను విడుదల చేయనున్నారు సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. సరిగ్గా 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రారంభోపన్యాసం ఉండనుంది. పార్టీ జమాఖర్చుల ఆడిట్ నివేదిక ప్రతిపాదన, ఆమోదం, అనంతరం పార్టీ నియమావళి సవరణల ప్రతిపాదన, ఆమోదం, 11:35 నుంచి 11.45 నిమిషాల వరకు పార్టీ కార్యక్రమాలను నివేదన ఉండనుంది.
ఆ తర్వాత ప్రారంభం కానున్న తీర్మానాలు ఉండనున్నాయి. 11 గంటల 45 నిమిషాలకు మొదటి తీర్మానంగా మహిళా సాధికారత దిశ చట్టం పెట్టనున్నారు. తీర్మానం పై మంత్రులు ఉషశ్రీ చరణ్, రోజా , ఎమ్మెల్సీ పోతుల సునీత, లక్ష్మీపార్వతి, జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడనున్నారు. అనంతరం పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సందేశం చేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు అధ్యక్షుడు జగన్ ముగింపు ఉపన్యాసం ఉండనుండగా.. గంటా 20 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు జగన్. కార్యకర్తలను, పార్టీని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్న జగన్.. మూడేళ్ల పాలన, భవిష్యత్ ప్రణాళికను ప్రజల ముందు పెట్టనున్నారు.