థర్డ్ క్లాస్ లో టెన్త్ పాస్.. ఇప్పుడు ఓ కలెక్టర్.. సక్సెస్ స్టోరీ..

-

బాగా చదివితే ఎవరైనా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారు..కానీ వారి నాలెడ్జ్ మాత్రం శూన్యం..మార్కులు ప్రతిభను అంచనా వెయ్యలేవు..బాగా మార్కులు వచ్చిన వారికంటే, మామూలుగా పాస్ మార్కులు వచ్చిన విద్యార్థులు ఎందరో ఇప్పుడు అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఆ జాబితాలో ఇప్పుడు ఓ కలెక్టర్ ఉన్నారు.ఆయన పదో తరగతి థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యాడు.. కానీ, ఐఎఎస్ లో ర్యాంక్ సాధించి ఇప్పుడు కలెక్టర్ భాద్యతలు నిర్వహిస్తున్నారు. అతని సక్సెస్ సీక్రెట్స్ ఏటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఛత్తీస్గఢ్ కేడర్.. 2009 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అవనీష్ శరణ్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. విద్యార్థులను ఉత్సాహపరిచే లక్ష్యంతో అవనీష్ తన పదవ మార్కుషీట్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.మొదట ఈ మార్క్స్ షీట్ చూసిన వారు ఆశ్చర్యపోయారు, ఆపై – మీరే మాకు స్ఫూర్తి . నిజానికి, అవనీష్ శరణ్ థర్డ్ డివిజన్ లో పదవ తరగతి ఉత్తీర్ణత అయ్యారు. నేడు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నతి పదవి చేపట్టి ఆయన తన సేవలను అందిస్తున్నారు.

IAS అధికారి అవనీష్ శరణ్ తన 10వ తరగతి మార్క్షీట్ను ట్విట్టర్లో పంచుకున్నారు. దాని ప్రకారం అవనీష్ 1996లో బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 700 మార్కులకు 314 మార్కులు మాత్రమే వచ్చాయి. అంటే 44.5% మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. గణితంలో 30 మార్కులకు పాస్ కాగా.. అవనీష్ కు 31 మార్కులు వచ్చాయి. అవనీష్ శరణ్ మార్కుల అధికంగా రానప్పటికీ UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. మార్కులు చూసి వ్యక్తి సామర్థ్యాన్ని కొలవలేమని కామెంట్ తో ఈ మార్కుల షీట్ ను జత చేశారు అవనీష్..

IAS అవనీష్ శరణ్ జీవితం పోరాటాలతో నిండి ఉంది. ఆయన ఇంట్లో కరెంటు సౌకర్యం లేదని, లాంతరు వెలుగులో తాను ఎలా చదువుకునేవాడినని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బీహార్లోని సమస్తిపూర్ జిల్లా కేవటా గ్రామ నివాసి. తండ్రి , తాత ఇద్దరూ ఉపాధ్యాయులు. ఐఏఎస్ శరణ్ నినాదం, ‘మనకు ఉన్నది ఒకటే జీవితం వీలైనంత వరకు నలుగురికీ సాయంగా ఉండటం..ఇప్పుడు మంచి అధికారిగా అందరి మన్ననలను పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news