ఛాలెంజ్ నెగ్గిన జగ్గారెడ్డి…. గతంలో ఓట్లు తక్కువగా వస్తే రాజీనామా చేస్తానని సవాల్…

-

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తాను చేసిన ఛాలెంజ్ లో గెలుపోందారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగ్గారెడ్డి సవాలే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానల్లో విజయం సాధించారు. అయితే మెదక్ ఎమ్మెల్సీ స్థానంపై సవాల్ చేశారు జగ్గారెడ్డి. మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి 200 కన్నా ఒక్క ఓటు తక్కువగా వచ్చినా..తాను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెదక్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ 238 ఓట్లను సాధించింది.

jaggareddy | జగ్గారెడ్డి

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విసిరిన సవాల్ కన్నా 38 ఓట్లు అధికంగా వచ్చాయి. కాగా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 230 ఓట్ల బలం మాత్రమే ఉంది. అయితే మరో 8 ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 1018 ఓట్లు ఉంటే.. ఒంటేరు యాదవరెడ్డి 762 ఓట్లు సాధించి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరుపున జగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డికి 238 ఓట్లు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news