కేసీఆర్ కు జ‌గ్గారెడ్డి లేఖ‌..ఇంట‌ర్ విద్యార్థుల‌ను పాస్ చేయండి

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి లేఖ రాశారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సీఎం కెసిఆర్ కి జగ్గారెడ్డి లేఖ రాశారు. ఇంటర్ విద్యార్థులకు పాస్ మార్కులు వేయాలని… విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు తేవద్దని లేఖ‌లో కోరారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదని.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం అడొద్దని పేర్కొన్నారు జ‌గ్గారెడ్డి.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

ఇంట‌ర్ కనీస మార్కులు వేసి పాస్ చేయాలని డిమాండ్ చేశారు జ‌గ్గారెడ్డి. విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న తర్వాత స్పందిస్తారా..? అని ఫైర్ అయ్యారు. మంత్రులు.. కనీసం ఆలోచన చేయకుండా ఫలితాలు ఇవ్వడం సరికాదని మండిప‌డ్డారు. అనాలోచి నిర్ణయాలు.. ఇంత ఆలస్యంగా నిర్ణయాలు సరి కాదని చెప్పారు. విద్యార్ధులు రోడ్డు ఎక్కే వరకు ఎందుకు వచ్చిందని.. పిల్లలు చనిపోకుండా ఆపాల‌ని కోరారు జ‌గ్గారెడ్డి. కాగా… ఇటీవ‌లే తెలంగాణ ఇంట‌ర్ బోర్డ్ ఫ‌స్ట్‌..ఇయ‌ర్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. అయితే.. ఈ ఫ‌లితాల్లో 51 శాతం ఫెయిల్ అయ్యారు. దీంతో కొంత‌మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య కూడా చేసుకున్నారు.