‘మీదో అడుగు మాదో అడుగు’ నినాదంతో భారత్ జోడో యాత్ర : జైరామ్ రమేశ్

-

భారత్‌ జోడో యాత్ర.. ‘మన్‌కీ బాత్‌’ తరహాలో సాగే వన్‌ వే షో కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ అన్నారు.  ఇందులో ఎక్కడా సుదీర్ఘ ప్రసంగాలు, ప్రభోదాలు, డ్రామాలు, టెలీప్రాంప్టర్లు ఉండవని జైరామ్‌ రమేశ్‌ ఎద్దేవా చేశారు. ప్రజల గోడు విని వారి డిమాండ్లను దిల్లీకి చేర్చడమే ఈ యాత్ర ఉద్దేశమని పేర్కొన్నారు. ‘మీదో అడుగు, మాదో అడుగుతో దేశాన్ని కలుపుదాం’ అనే నినాదంతో యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే జోడో యాత్రను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా యాత్ర గీతాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జైరామ్ రమేశ్ ఆవిష్కరించారు. దేశం విభజనకు గురౌతోందన్న కారణంతో ‘జోడో’ యాత్రకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆర్థికంగా, సామాజికంగా దేశం విడిపోతోందని, రాష్ట్రాల హక్కులు హరించుకుపోతున్నాయని.. అందుకే ఆ యాత్ర చేపడుతున్నామన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగే ఈ యాత్రలో రాహుల్‌ సహా మరికొంతమంది భారత్‌యాత్రీలు ఉంటారని చెప్పారు. ఈ యాత్రను పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో లైవ్‌స్ట్రీమ్‌ చేస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news