ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న జక్కన్న..!

-

ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డును రాజమౌళి సొంతం చేసుకున్నారు. న్యూయార్క్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న రాజమౌళి ఆర్ఆర్ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా ఈ అవార్డును అందుకోవడం జరిగింది. సినీ ప్రియులు ఈ సినిమా టీంకు ధన్యవాదాలు చెబుతున్నారు. అంతేకాదు తన కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని కూడా తెలిపారు జక్కన్న.

రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేదికపై అందరి ముందు నిల్చొని మాట్లాడడం కాస్త కంగారుగా అనిపిస్తుంది. ముఖ్యంగా నా దృష్టిలో సినిమా అంటే దేవాలయం. చిన్నప్పుడు థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు పొందిన ఆనందం ఇప్పటికీ గుర్తుంది.. ఏ సినిమా తీసినా అందులో ప్రతి సీన్ చిత్రీకరించే ముందు ఎలా ఉంటుంది అని ఒక ప్రేక్షకుడిగా నేను ఊహించుకుంటా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఆకట్టుకోవడం కోసం నేను సినిమాలు చేస్తుంటాను..

కానీ ఆర్ఆర్ఆర్ కు వచ్చేసరికి భారతీయులు ఎలాంటి ప్రేమను చూపించారో అదే అభిమానాన్ని, ఉత్సాహాన్ని నేను విదేశాల్లో కూడా చూశాను. ముఖ్యంగా విదేశీయులు కూడా ఈ సినిమాపై విపరీతమైన అభిమానం చూపించారు. న్యూయార్క్ , చికాగో కి వెళ్ళినప్పుడు కూడా థియేటర్లలో వాళ్ళ ఆనందాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. చిత్ర బృందం మొత్తం నా కుటుంబం అంటూ ప్రతి ఒక్కరూ సాధారణంగా చెబుతుంటారు. కానీ నా విషయంలో అది కాస్త భిన్నం. ఎందుకంటే నా సినిమాల కోసం పనిచేసే ముఖ్యమైన వ్యక్తులందరూ నా కుటుంబ సభ్యులే. ” నా తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తుంటారు.. పెద్దన్నయ్య కీరవాణి సంగీత దర్శకుడిగా, నా భార్య రమా కాస్టింగ్ డిజైనర్ గా , నా కొడుకు కార్తికేయ, వదిన వల్లి లైన్ ప్రొడ్యూసర్లుగా, సోదరుడి కుమారుడు కాలభైరవ గాయకుడిగా, మరో సోదరుడు రచయితగా ఇలా వీళ్లంతా నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అందుకే నేను ఎప్పుడూ వీరిని మర్చిపోలేను అంటూ తెలిపారు రాజమౌళి.

Read more RELATED
Recommended to you

Latest news