జల్లికట్టును అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వ కీలక నిర్ణయం.

-

తమిళనాడు ప్రజానీకానికి ఎంతో సంతోషం కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. జల్లికట్టును అనుమతిస్తూ సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే కోవిడ్ రూల్స్ పాటిస్తూ జల్లికట్టు నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పోటీలు చూసేందుకు తక్కువ సంఖ్యలో ప్రేక్షకులకు అనుమతి ఇచ్చింది. పోటీల్లో పాల్గొంటున్న వారు ఖచ్చితంగా రెండు డోసులు తీసుకోవాలనే నియమాన్ని పెట్టింది. పోటీలో పాల్గొనే వారికి పరిమిత సంఖ్య కేవలం 150 నుంచి 200 మంది వరకే అనుమతి ఉంటుందని తెలిపింది. దీంతో పాటు పోటీలో పాల్గొనే ఎద్దులను వైద్యుల పర్యవేక్షణలో ఉంటాలని ఆదేశించింది ప్రభుత్వం. ఆదిావారం లాక్ డౌన్ నుంచి జల్లికట్టు క్రీడలకు మినహాయింపు ఇచ్చారు.

తమిళనాడులో పొంగల్ వేడుకల్లో జల్లికట్టు సంప్రదాయంగా వస్తోంది. గతంలో జల్లికట్టుపై తమిళనాడు వ్యాప్తంగా ఉద్యమమే నడిచింది. తమిళనాడు వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మక క్రీడగా జల్లికట్టును భావిస్తారు. తమ సంప్రాదాయాల్లో ఒకటిగా భావిస్తుంటారు. తమిళ నాడు దక్షిణ ప్రాంతం ముఖ్యంగా మధురై చుట్టుపక్కల జిల్లాలో పోటీలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈనెల 14న మధురైలో జల్లికట్టు ప్రారంభం కానుంది. అవనీయపురంలో 14 తేదీన, పాలమేడులో 15న, అలాంగనల్లూర్ 16న జల్లికట్టు క్రీడలు ప్రారంభం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news