మార్పు కోసం ప్రయత్నం.. జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ వినూత్న ప్రయత్నాలు.

-

జమ్మూ కాశ్మీర్ యువతను, రాబోయే తరాలను ఉగ్రవాదం, తీవ్రవాదం వైపు మరలకుండా ఆర్మీ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికీ కొంతమంది యువత తీవ్రవాదం వైపు వెళ్తుండటంతో ప్రభుత్వం కూడా వారికి విద్య, ఉపాధి అవకాశాలపై ద్రుష్టి పెట్టింది. ముఖ్యంగా అక్కడి పిల్లల్లో, యువతలో ఉన్న ప్రతిభను గుర్తించేందుకు ఆర్మీ కూడా ప్రయత్నిస్తోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో హాకీ, క్రికెట్, సింగింగ్ వంటి పోటీలను పెడుతోంది.

పూంచ్ జిల్లాలో హకీ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించింది. 10 జట్లు తలపడే ఈ పోటీలు నవంబర్ 12 నుంచి 20 వరకు జరుగనున్నాయి. ఈ పోటీల్లో 6 పురుషుల జట్లు, 2 మహిళా హాకీ జట్లు పాల్గొననున్నాయి. దీని తర్వాత ఈనెల 22 నుంచి క్రికెట్ టోర్నీని ఆర్మీ ప్రారంభించనుంది. దీంతో పాటు పిల్లలు, యువతలో ఉన్న టాలెంట్ ను సింగింగ్ కాంపిటీషన్ ద్వారా వెలికితీసే ప్రయత్నం చేస్తుంది ఆర్మీ. ప్రస్తుతం ఆర్మీ తీసుకున్న నిర్ణయం పట్ల స్థానికుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ప్రతీ ఏడాది ఇలాగే కార్యక్రమాలను నిర్వహించాలని స్థానికులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news