తెదేపా పై నిప్పులు చెరిగిన పవన్‍

-

రాజమండ్రిలో కాటన్ బ్యారేజీపై ఏర్పాటు చేసిన కవాతు అనంతరం… సభలో జనసేన అధినేత పవన్‍ కల్యాణ్ మాట్లాడుతూ… తెదేపా అధినేత పై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీకి నిస్వార్థంగా మద్దతు తెలిపితే అది జనసేన చేతగాని తనంగా పేర్కొంటూ అనేక మంది పలు విమర్శలు చేశారు. రాష్ట్రం పట్ల ప్రేమతో, దేశ భక్తితో రాష్ట్రం బాగుపడాలని, అనుభవజ్ణుడైన నాయకుడు ముఖ్యమంత్రి కావాలని నాడు భావించి చంద్రబాబుకి మద్దతునిచ్చాను. నాడు ఎన్నిల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఇసుక దోపిడీలు, అవినీతి రాజ్యమేలుతున్నాయన్నారు. జన్మ భూమి కమిటీల పేరుతో గ్రామీణ వ్యవస్థను చేస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. వారసత్వాలతో ముఖ్యమంత్రులు కాలేరన్నారు. జనసేన పార్టీ బాధ్యత, క్రమశిక్షణతో నడిచిపార్టీ అని ప్రజా జీవితాన్ని శాశించే పార్టీని నడిపేవ్యక్తికి అనుభవం ఉండాలన్నారు. జెండా మోస్తేనే పదవులు ఇచ్చే ఈరోజుల్లో జనసేన పార్టీ ఆలోచనలు ఇష్టపడే ప్రజలు మద్దతు ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పదవి నాకు అలంకారం కాదన్నారు. అది పవిత్రమైన బాధ్యతగా పరిగణిస్తానన్నారు. కింది స్థాయిలో నుంచి వచ్చిన వ్యక్తిగా కష్టాలు తెలిసినవాడిని కానిస్టేబుల్‍ కొడుకు సీఎం కాలేడా అంటూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version