కేంద్ర కేబినెట్‌లోకి పవన్ కల్యాణ్ ?

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణపై ప్రధాని మోదీ కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే అమిత్ షా, నడ్డాతో ప్రధాని వరుస భేటీలు నిర్వహించారు. త్వరలో కేబినెట్‌లో పలువురిని తీసుకుని, పలువురికి ఉద్వాసన పలకాలని మోదీ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన కసరత్తులు చేస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు, మిత్ర పక్షంతో ఉన్న రాష్ట్రాల్లోని ఆగ్ర నాయకులకు అవకాశం కల్పించాలని యోచిస్తున్నారని తెలుస్తోంది.

మరోవైపు కేబినెట్ పునర్ వ్యవస్థకరణలో తెలుగు రాష్ట్రాలకు చోటు కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ నుంచి జి.కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నారు. ఈసారి ఏపీ నుంచి ఎవరికో ఒకరికి చోటు కల్పించాలని ప్రధాని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీ నుంచి జీవీఎల్ నరసింహారావు, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, సీఎం రమేశ్ రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో మిత్రపక్షమైన పవన్ కల్యాణ్‌ను కేంద్ర కేబినెట్‌లో తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఏపీలో బీజేపీ బలోపేతానికి పవన్ మద్దతు ఉంటుందని భావిస్తున్నారు. తిరుపతి ఎంపీ, గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులకే అవకాశం దక్కింది. జనసేన పోటీ చేయలేదు. ఏపీలో జనాదారణ కలిగిన నేత కాబట్టి పవన్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటే బలం పెరుగుతుందని అటు బీజేపీ నేతలు కూడా అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.