2014లో టీడీపీని నేను గుడ్డిగా సపోర్ట్ చేయలేదని తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవాళ పార్టీనేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. మీడియాతో మాట్లాడుతూ.. 2009లో చేసిన తప్పును సరిదిద్దేందుకే 2014లో టీడీపీకి మద్దతిచ్చాను.. గత ప్రభుత్వంలో ఉత్పన్నమైన సమస్యలపై స్పందించానని వెల్లడించారు.
చిన్న సైజు రాజధాని పెట్టమని గత ప్రభుత్వ హయాంలోనే నేను చెప్పాను…. ఆనాడు వైసీపీ నేతలే నన్ను విమర్శించారని ఆగ్రహించారు. చట్ట సభల్లో రాజధానికి వైసీపీ మద్దతిచ్చింది…. చట్టసభల్లో రాజధాని విషయంలో గతంలో వైసీపీ ఇచ్చిన మాటను తప్పిందని ఫైర్ అయ్యారు.
సుగాలి ప్రీతి విషయంలో జరిగిన అన్యాయాన్ని చూసినప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే బాగుండేదే అనిపించింది… ఇప్పటికీ సుగాలి ప్రీతి కేసు ఏటూ తేలలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యేలు పది మంది ఉండుంటే సమస్యలరై గట్టిగా నిలదీసేవాళ్లం కదా అనిపించింది… వియ్ ద నేషన్ అని నానీ పాల్కీవాలా రాసిన పుస్తకం నాకు స్పూర్తి అని చెప్పారు. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్.. ఇది అంబేద్కర్ నినాదం.. అదే జనసేన స్పూర్తి మంత్రం అని తెలిపారు. సినిమాలు నా ఆదాయ మార్గం.. నా ఆలోచన అంతా పేదల కష్టాల మీదే ఉండేదని వివరించారు పవన్ కళ్యాణ్.