సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించిన జనసేనాని

-

తెలుగుదేశం పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్న జనసేనాని..బుధవారం ఉప్పాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనుభవం, దక్షత మనకు కావాలని,ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు అపార అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు సార్లు సీఎంగా పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు అని..ఆయన గొప్ప విజన్ ఉన్న లీడరనిప్రశంసల వర్షం కురిపించారు.

నిత్యం రాష్ట్రాభివృద్ధికి కోసం పరితపించే నేత అని ,ఏపీ పునర్నిర్మాణం కోసమే చంద్రబాబు మద్దతు కోరానని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.అఖండ విజయం సొంత చేసుకుని చంద్రబాబు నాలుగోసారి ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. పిఠాపురం నుండి జనసేనాని తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news