జనసేనాని గెలుపు… అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఏపీ అసెంబ్లీ తో పాటు లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలనం క్రియేట్ చేసింది.అధికార వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్..తాను అనుకున్నది సాధించారు.జనసేనాని అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. పవర్ స్టార్ ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా అమరావతి శాసనసభకు వెళ్లడమే మిగిలింది. తాజాగా వెల్లడైన ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ 50 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ” అద్భుతమైన విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్‌కు నా హృదయపూర్వక అభినందనలు. మీ కృషి, అంకితభావం, ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధత ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు. ” అంటూ ట్వీట్ చేసారు.

దీనిపై స్పందించిన మెగా ఫ్యాన్స్ ఇప్పుడు బంధాలు గుర్తు వచ్చాయా.. గెలిచాక ఎవరికైనా గుర్తు వస్తాయి లే .. పక్కకి వెళ్లి ఆడుకోమ్మా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news