దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఎన్డీఏ కూటమి 292, ఇండియా కూటమి 232 స్థానాలు దక్కించుకుంది. ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యవస్థలపై నిఘా సంస్థలపై చేసిన యుద్ధంగా మేము భావిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే యుద్ధం చేశాం.
ఈ ఎన్నికలకు ముందు మా పార్టీకి సంబంధించిన బ్యాంకు అకౌంట్లన్నింటినీ సీజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీఎంలను జైలుకు పంపారు.అయినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పోరాట చేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రతీ కార్యకర్త పోరాడారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టించిందన్నారు. పార్టీలను విడదీశారు. ఎన్నికల్లో బీజేపీతో పాటు అనేక సంస్థలతో పోరాడామని తెలిపారు. ఇండియా కూటమి ఐక్యంగా కలిసి పని చేసింది. ఈ కూటమి కొత్త విజన్ ఇచ్చింది.