దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి కరోనా పాజిటివ్ నిజమా? అబద్దమా? అని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రశ్నించారు. అమ్మవారి గుడిలో 3 వెండి సింహాల మాయం ఘటనను పక్కదారి పట్టించడానికి కరోనా పాజిటివ్ డ్రామా ఏమన్నా ఆడారా? అని ఆయన నిలదీశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక కనీసం వారం రోజుల పాటు హోమ్ క్వారెంటిన్ ఉండాలనే నిబంధన ఉందని పేర్కొన్నారు.
కానీ మంత్రిగారు స్కూలు పిల్లలకు కిట్స్ పంపిణీ చేసే విద్య కానుక కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. మంత్రిగారికి కరోనా పాజిటివ్ ఉంటే మరి ఈ చిన్న పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. స్కూల్ పిల్లలకు విద్య కానుక కాదు వెల్లంపల్లి కరోనా కానుక ఇస్తారేమో అంటూ ఎద్దేవా చేసారు. ఇప్పుడు అదే ఆందోళన టీచర్లకి తల్లిదండ్రులకు పట్టుకుందని అన్నారు.