బీ టౌన్ షాకయ్యేలా జాన్వీ కపూర్ ట్రిపులెక్స్‌ అపార్ట్‌మెంట్

Join Our COmmunity

జాన్వి కపూర్‌ వయసు 23 ఏళ్లు. రెండు సినిమాలు చేస్తే.. ఒకటి థియేటర్‌లో మరోటి ఓటీటీలో రిలీజైంది. తల్లి శ్రీదేవిలా మాంచి పెర్‌ఫార్మర్‌ ఏమీ కాదు. చేతిలో రెండు సినిమాలున్నాయి. స్టార్‌ హోదా దక్కి 10 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకున్న హీరోయిన్స్‌ ముంబాయిలో బంగ్లాలు కొంటే.. జాన్వి మాత్రం తక్కువ టైంలో.. చిన్న వయసులో 40 కోట్లతో పోష్‌ ఏరియాలో ట్రిపులెక్స్‌ అపార్ట్‌మెంట్ కొనడంతో.. బీ టౌన్‌ అవాక్కయింది.

 

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌ ధడక్‌ అనే మూవీతో వెండితెరపైకి వచ్చింది. ఫస్ట్ మూవీతోనే 100 కోట్ల క్లబ్‌లో చేరినా… ఆతర్వాత వచ్చిన ఆఫర్స్‌ అంతంత మాత్రమే. మొదట్లో తెలుగు ఇండస్ట్రీ ఈ అమ్మడి డేట్స్‌ కోసం ప్రదక్షణలు చేసినా.. ఈ అమ్మడి టాలెంట్‌ చూసి పట్టించుకోవడం మానేశారు.

రెండో సినిమా గుంజన్ సక్సేనా’జాన్వి నటనకు మంచి గుర్తింపు లభించింది. అయితే.. లాక్‌డౌన్‌ టైంలో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కావడం.. అదే సమయంలో… సుశాంత్‌ మరణం తర్వాత నెపోటిజం కారణంగా.. గుంజన్‌ సక్సేనాకు గుర్తింపు దక్కలేదు. ప్రస్తుతం ‘రూహి అఫ్జానా’.. ‘దోస్తానా2’ సినిమాలు చేస్తోంది. కెరీర్‌ స్టార్ట్‌ చేసినప్పటి నుంచి ప్రముఖ మ్యాగజైన్స్‌కు ఫోటోషూట్‌ ఇచ్చి… గ్లామర్‌ గుప్పించింది. దీపిక పదుకునే.. కత్రిన కైఫ్‌ తీసుకునే రెమ్యునరేషన్‌లో సగం కూడా తీసుకోని జాన్వి 39 కోట్లు పెట్టి ఇల్లు కొనడంతో బాలీవుడ్‌ షాక్‌ అయింది.

ముంబాయి నగరంలో సినీ సెలబ్రిటీస్‌ ఎక్కువగా నివశించే ‘జూహూ’లో జాన్వి అపార్ట్‌మెంట్‌ కొన్నదంటూ వార్తలొచ్చాయి. స్టాంప్‌ డ్యూటీనే 70 లక్షలు అయిందట. 2 కోట్లతో ఇంటీరియర్‌ చేయిస్తోంది. ప్రస్తుతం వున్న ఇల్లు చిన్నదైపోవడంతో.. తండ్రి ఆశీస్సులతో హైక్లాస్‌ అపార్ట్‌మెంట్‌ను కొనేసిందని తెలిసింది. చేసిన సినిమాలు తక్కువ. వచ్చిన క్రేజ్‌ తక్కువ. కానీ.. 39 కోట్లతో విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో ప్లాట్‌ను కొనేయడం జాన్వీకే చెల్లిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news