పవన్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. సంక్రాంతికి డబల్ ధమాకా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. చాలా రోజుల తరువాత పవన్ నుండి వస్తున్న సినిమా అవడంతో అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన పింక్ సినిమాకి రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కింది. హిందీలో అమితాబ్ పోషించిన పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. ఐతే తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ఇప్పటివరకు మోషన్ పోస్టర్ సహా, ఒక పాటని రిలీజ్ చేసిన చిత్రబృందం టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన సాయంత్రం 6గంటల 3నిమిషాలకి వకీల్ సాబ్ టీజర్ లాంచ్ అవనుందని ప్రకటించారు. అంటే సంక్రాంతి తో పాటు మరో పండగ మొదలవందన్నమాట. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న వకీల్స్ సాబ్ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాని వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.