జనవరి 19 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ పుష్యమాసం – జనవరి 19-  మంగళవారం.

 

మేషరాశి:ఈరోజు వేడుకలలో పాల్గొంటారు !

మీకు ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. కానీ ఏదో తెలియని అసంతృప్తి. మీరు చేసే స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. అనుకోని ఖర్చులు, వ్యయం అవుతుంది.  స్నేహితులతో కలిసి విందులు, వేడుకలలో పాల్గొంటారు. ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి.  వైవాహికంగా సంతోషకరమైన జీవితం గడుపుతారు.

పరిహారాలుః శివపంచాక్షరీ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపం చేయండి.

 

todays horoscope

వృషభరాశి:ఈరోజు సమస్యలు పరిష్కారం అవుతాయి !

కుటుంబ పరిస్థితులతో అందరితో సర్దుకుపోవడం మంచిది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిన సమయం. వైవాహికంగా బాగుంటుంది. ఈరోజు కుటుంబంలో సంతోషం,. అనుకోని అతిథి రాక. మీరు చూపించే తెలివితేటలు, పట్టువిడుపు ధోరణితో మీ సమస్యలు పరిష్కారమవుతాయి.

పరిహారాలుః శ్రీలక్ష్మీ, సోమేశ్వర స్వామి ఆరాధన చేయండి.

 

మిథునరాశి:ఈరోజు వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి !

మీ చుట్టూ ఉండే వారి వల్ల ఇబ్బందులు తప్పవు. మీరు చిరకాలంగా అనుకుంటున్న వ్యాపారం చేయాలని సంకల్పం ఫలిస్తుంది. మీ భాగస్వామి వైఖరితో మీకు చికాకు కలుగుతుంది. కానీ చివరకు అంతా సర్దుకుంటుంది. ఈరోజు ఓపికతో, సహనంతో వ్యవహరించండి.

పరిహారాలుః సోమవారం ఉపవాసం, శివ ఆరాధన చేయండి.

 

కర్కాటకరాశి:ఈరోజు ఉద్యోగస్తులకు పదోన్నతికి అవకాశం !

ఈరోజు మీకు మంచి ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. మీ స్నేహితలకు ఆర్థిక సహాయం చేస్తారు.  ఆఫీస్‌లలో పనిచేసే ఉద్యోగస్తులకు ప్రమోషన్, ప్రత్యేక ఇంక్రిమెంట్లు, బోనస్ వంటి శుభవార్తలు వింటారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీశివకవచం పారాయణం చేయండి.

 

సింహరాశి:ఈరోజు శత్రువులు మిత్రులుగా మారుతారు !

శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి ఇబ్బంది ఉండదు. చిరువ్యాపారులకు పురోభివృద్ధి. ఈరోజు అనుకోని ఫలితాలు వస్తాయి. వైవాహికంగా చిన్న సమస్యలు వచ్చినా అధిగమిస్తారు.

పరిహారాలుః శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి మరింత మంచి ఫలితాలు వస్తాయి.

 

కన్యరాశి:ఈరోజు ఖర్చులు అధికమవుతాయి !

ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థులు సమయం వృథా చేస్తారు. పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వైవాహికంగా బాగుంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో శుభకార్యానికి ప్రయత్నాలు మొదలుపెడతారు.

పరిహారాలుః శివాలయంలో ప్రదక్షణలు చేయండి. వీలైతే సోమవార ఉపవాసాన్ని పాటించండి.

 

తులరాశి:ఈరోజు వ్యాపారాభివృద్ధి కోసం శ్రమిస్తారు !

ఆఫీస్‌లో సాధారణంగా ఉంటుంది. ఇంటర్యూవకు హాజరయ్యే వారికి పరీక్ష కాలంగా చెప్పవచ్చు. కుటుంబంలో సభ్యుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. వాహనాలు నడిపేటటప్పుడు జాగ్రత్త. దేవాలయాలను సందర్శిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి బాగా కష్టపడుతారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీమల్లికార్జున స్వామి ఆరాధన, స్తోత్రం పారాయణం చేయండి.

 

వృశ్చికరాశి:ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు !

ఈరోజు మీ ఆలోచనలను ఎవరికి చెప్పకండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గోప్యత పాటించండి. ఆఫీస్‌లో మీపై పర్యవేక్షణ ఉందన్న విషయం మరిచిపోకండి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీశివాభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.

 

ధనస్సురాశి:ఈరోజు ప్రయాణాలు కలసివస్తాయి !

వ్యాపారులకు లాభాలు వస్తాయి. మీకు ఈరోజు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలలో మీ వస్తువులు జాగ్రత్త. అనుకోని అతిథి మీ ఇంటికి వస్తారు. వైవాహికంగా సంతోషమైన జీవితాన్ని గడుపుతారు.

పరిహారాలుః శివుడికి పంచామృతాభిషేకం చేయండి.

 

మకరరాశి:ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది !

ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. ఆఫీస్‌లో ఓర్పుతో పనిచేయండి. వివాదాలకు దూరంగా ఉండండి. బాకీలు తీరుస్తారు. పనులు వాయిదా పడుతుంటాయి. కానీ పట్టుదలతో వాటిని చేయాలని ప్రయత్నిస్తారు. వైవాహికంగా బాగుంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

పరిహారాలుః శ్రీదుర్గాదేవి ఆరాధన మంచి ఫలితం వస్తుంది.

 

కుంభరాశి:ఈరోజు మీకు గుర్తింపు !

ఈరోజు మీకు అలసట, వత్తిడి ఉంటుంది. ఇంటికి బంధువుల రాక సంతోషాన్నిస్తుంది. మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువుల నుంచి బహుమతులు అందుకుంటారు విద్యార్థుల్లో ఏకాగ్రతా లోపం, నిదానం వంటి చికాకులు చోటుచేసుకుంటాయి.వైవాహికంగా ఆనందమైన సమయం.

పరిహారాలుః శ్రీచంద్రగ్రహారాధన చేయండి.

 

 

మీనరాశి:ఈరోజు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది !

ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. పనులు వాయిదా పడుతాయి. ప్రయాణాలలో మీ సామాన్లు జాగ్రత్త. వైవాహికంగా బాగుంటుంది. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆఫీస్‌లో పై అధికారుల నుంచి ఒత్తిడి, అధికమవుతుంది.

పరిహారాలుః శ్రీకాలభైరావాష్టకం పారాయణం చేయండి.

 

  • శ్రీ

 

 

Read more RELATED
Recommended to you

Latest news