స్నేహితుడు లేడు.. కానీ స్నేహం ఉందని నిరూపించే సంఘటన.. తెలంగాణ జగిత్యాలలో..

-

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అని చెబుతుంటారు. అది నిజమే. ఏదైనా బంధంలో గొడవొస్తే కలవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒకవేళ కలిసినా మళ్ళీ పూర్వం ఉన్నట్టుగా ఉండరు. కానీ స్నేహంలో అలా కాదు. ఈరోజు గొడవ పెట్టుకుని రేపు మాట్లాడుకునేవాళ్లే స్నేహితులు. అందుకే ఎవ్వరితో పంచుకోని విషయాలని స్నేహితులతో పంచుకుంటారు. అందరూ వదిలేసినా స్నేహితుడు మాత్రం పక్కనే ఉంటాడు. అందరి దగ్గర నటించే వాళ్ళు కూడా స్నేహితుల దగ్గర ఒరిజినల్ గా ఉంటారు. ఎదుటివారు ఏమనుకుంటారో అన్న ఆలోచన రాకుండా ఒకరి దగ్గర ఉంటున్నామంటే అది స్నేహితులే అయ్యుంటారు.

స్నేహితుల గురించి తెలిపే సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. స్నేహ బంధాన్ని గూర్చి పాటలు, మాటలు చాలానే ఉన్నాయి. స్నేహానికి ఉన్న ఇంపార్టెన్స్ ఎలాంటిదన్న సంఘటనలు తరచుగా జరుగుతుంటాయి.

తాజాగా అలాంటి సంఘటనే జగిత్యాలలో జరిగింది. స్నేహితుడు లేకపోయినా అతడి కుటుంబానికి చేసిన సహాయం స్ఫూర్తివంతమైనది. కరెంట్ షాక్ తో మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి అతని స్నేహితులు ముందుకు వచ్చారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగలాయిపేట్ గ్రామానికి చెందిన పిట్టల విద్యాకర్ ప్రమాదవశాతు కరెంట్ షాక్ కి గురై మరణించాడు. భార్యాపిల్లలున్న స్నేహితుడు అనుకోకుండా మృతి చెందడంతో వారి కుటుంబానికి ఆర్థికభారం ఇబ్బందిగా మారుతుందని గ్రహించిన స్నేహితులు, అతడి కుటుంబానికి సాయంగా 80వేల బాండుని అందించారు.

అతని స్నేహితులతో పాటు, అతనికి చదువు చెప్పిన ఉపాధ్యాయులు కూడా ఈ సాయానికి తోడ్పడ్డారు. భవిష్యత్తుల్లో ఆ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక అవసరం వచ్చిన అండగా ఉంటామని తెలిపారు. కలిసి ఉన్నప్పుడే స్నేహితులం, విడిపోతే నువ్వెవరో, నేనెవరో అనుకుంటున్న ఈ రోజుల్లో స్నేహితుడు లేకపోయినా తన కుటుంబాన్ని ఆదుకుంటున్న స్నేహం నిజంగా చాలా గొప్పది.

Read more RELATED
Recommended to you

Latest news