విజయవాడ శివారు గొల్లపూడిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి కొడాలి నాని సవాల్ కు ప్రతి సవాల్ గా గొల్లపూడి ఎన్. టి. ఆర్ సర్కిల్ లో నిరసన దీక్షకు దేవినేని ఉమా పిలుపు నిచ్చారు. దేవినేని ఉమా సవాల్ తో అప్రమత్తమైన పోలీసులు, గొల్లపూడిలోని దేవినేని ఉమా నివాసంతో పాటు గొల్లపూడిలో ఎన్. టి. ఆర్ సర్కిల్ లో భారీ ఎత్తున మోహరించారు.

ఒక రకంగా గొల్లపూడి పోలీసుల వలయంలో ఉందని చెప్పచ్చు. ఉమాను మాత్రమే కాక తెలుగుదేశం క్రియాశీలక నేతల పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి కొడాలి నాని చేసిన విమర్శలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిరసన దీక్షకు కూర్చుంటున్నానని ఉమా ప్రకటించారు. జగన్ వచ్చి టచ్ చేస్తారా లేక బూతుల మంత్రి ని పంపుతారో తేల్చుకునేందుకు సిద్ధం అని ఆయన ప్రకటించారు. పోరంబోకు మంత్రి పోరంబోకు మాటలకు ప్రజలే సమాధానం చెప్తారని ఆయన అన్నారు.