జనవరి 26 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our Community
follow manalokam on social media

శ్రీరామ పుష్యమాసం – జనవరి 26 –  మంగళవారం.

 

మేష రాశి:కార్య లాభం పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. అనుకున్న పనులను సరైన సమయంలో పూర్తి చేసి కార్య లాభం పొందుతారు. ధన లాభం పొందుతారు. నూతన గృహాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు పొందుతారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని కోరుకుంటారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఇంతకుముందు పోగొట్టుకున్న వస్తువులను అవసరం ఈరోజు పొందే అవకాశం ఉంది.

పరిహారాలుః ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:అధికారుల మెప్పు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. మొండి బాకీలు వసూలు చేసుకొని అప్పుల బాధలు తీర్చుకొని ధన లాభం పొందుతారు. మీ మాట తీరు బాగుండటం వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు.  వ్యాపారాలను విస్తరించడం వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంది. నూతన వ్యక్తుల పరిచయాలు లాభాలను కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల మెప్పు పొందుతారు. దైవ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు.

పరిహారాలుః అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 మిధున రాశి:ఈరోజు పేరు ప్రఖ్యాతులు పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. బాకీలను వసూలు చేసుకొని ధనలాభం పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి సఖ్యతగా ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకొని సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. గృహ స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. సోదరులు కలిసిమెలిసి సఖ్యతగా ఉంటారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తమ విద్యార్థులుగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు.

పరిహారాలుః ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి.

 

కర్కాటక రాశి:ఈరోజు వ్యాపారంలో స్వల్ప నష్టం !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో స్వల్ప నష్టం ఏర్పడే అవకాశం అవకాశం ఉంది. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసరపు విషయాలకు, చర్చలకు దూరంగా ఉండటం మంచిది. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. తొందరపడి మాట జారడం వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వివాహాది నిశ్చయ తాంబూలాలకు అనుకూలమైన రోజు కాదు, వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, అనారోగ్య సమస్యలు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది.

పరిహారాలుః శివ అష్టోత్తర పారాయణం చేసుకోండి, ఎర్రని పూలను భగవంతునికి సమర్పించండి.

 

సింహరాశి:పోటీ పరీక్షలో విజయం !

ఈరోజు బాగుంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందే ఉంది. అన్నదమ్ములు కలిసిమెలిసి సఖ్యతగా ఉంటారు. గృహంలో ఒక శుభకార్యం తలపెట్టే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీ పరీక్షలో విజయం పొందుతారు. వివాహ నిశ్చయ తాంబూలాలకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పోగొట్టుకున్న డబ్బును, మిత్రులను తిరిగి పొందుతారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

 కన్యారాశి:అన్యోన్యంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. బంధు మిత్రులు రాక సంతోషకరంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలో ఆదరణ పొందుతారు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు లలితా అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

 తులారాశి:ఈరోజు పనులు అనుకున్న సమయంలో పూర్తి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతారు. పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉన్నత విద్య కోసం కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంది. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభాలను కలిగిస్తాయి. గృహన్ని కొనుగోలు చేస్తారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఆరోగ్య విషయంలో క్షేమంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.

 

 వృశ్చిక రాశి:ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ పనిలో అయినా, ఏ విషయంలో అయినా తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది.

పరిహారాలుః ఈరోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి, పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేసుకోండి.

 

ధనస్సు రాశి:పనులను పూర్తి చేసుకుంటారు !

‌ఈరోజు బాగుంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ధన యోగం కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉత్తమ విద్యకు  అర్హులు అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకున్న స్థానాలకు బదిలీ అవకాశం ఉంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేసుకుంటారు.

పరిహారాలుః ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి.

 

మకర రాశి:పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు !

ఈరోజు అద్భుతంగా ఉంటుంది. అప్పుల బాధలు తీర్చుకొని అనవసర ఖర్చులకు దూరంగా ఉంది సంపాదన మీద శ్రద్ధ పెట్టి ధన లాభం పొందే అవకాశం ఉంది. సమాజంలో గొప్ప వ్యక్తిగా కీర్తింపబడే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి పూర్తి చేసే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టి లాభాలు  పొందే అవకాశం ఉంది. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రయాణ లాభాలు కలిగిస్తాయి. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి:ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. గతంలో పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుతారు. కాంట్రాక్టు ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అనుకున్న స్థానాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. వ్యాపారాల్లో అధిక లాభాలు. భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో సౌఖ్యంగా ఉంటారు. అనారోగ్యం తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి.

 

మీనరాశి:ఆఫీసుల్లో అవార్డు పొందే అవకాశం ఉంది !

ఈరోజు మిశ్రమ ఫలితాలు. మీలో ఉన్న తొందరపాటు తనంని తగ్గించుకోవడం మంచిది. మాట జారకుండా ఉండటం మంచిది. మీ సొంతంగా మీరే పనులు చేసుకోవడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటే పోటీపరీక్షల్లో విజయం పొందే అవకాశం ఉంది. ఆఫీసుల్లో ఒత్తిడి తగ్గించుకొని పనిచేయడం వల్ల అవార్డు పొందే అవకాశం ఉంది.

పరిహారాలుః ఈరోజు లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

TOP STORIES

యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌రుపుతున్నారా ? ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ ఎంతో తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం దాదాపుగా ఎవ‌రిని చూసినా డిజిట‌ల్ పేమెంట్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. న‌గ‌దుతో లావాదేవీల‌ను చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు. కార‌ణం.. బ‌య‌ట ప్ర‌తి చోటా ఆన్‌లైన్ లో...