జనవరి 27 బుధవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

​జనవరి – 27 – పుష్యమాసం – బుధవారం.

 

మేష రాశి:ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం !

ఈరోజు బాగుంటుంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంది ధన లాభం కలిగే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంది. నూతన పరిచయాల ఏర్పడే అవకాశం ఉంది. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయంలో పూర్తి చేసి కార్యసిద్ధి పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.

పరిహారాలు:ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:పోగొట్టుకున్న వస్తువులను పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి ఆచితూచి తీసుకుంటారు. మొండి బకాయిలు వసూలు చేసుకొని ధన లాభం పొందే అవకాశం ఉంది. ఎంత కష్టమైన పనినైనా ఆత్మస్థైర్యంతో అనుకున్న సమయంలో పూర్తి చేసి కార్యసాధన పొందే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య తగాదాలు, అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టదానికి అనుకూలంగా ఉంది. గతంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు.

పరిహారాలు:ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:వివాహా విషయాలకు అనుకూలం !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకొని అనారోగ్య సమస్యలు తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రుల అయ్యే అవకాశం ఉంది. మిత్ర లాభం పొందుతారు. ఈరోజు ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.  వ్యాపారాన్ని విస్తరించుకొని ధన లాభం పొందే అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. వివాహాది విషయాలకు అనుకూలమైన రోజు.

పరిహారాలు:ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి.

 

కర్కాటక రాశి:ఈరోజు ఉద్యోగస్తులకు పని వత్తిడి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు చేయడం వల అప్పుల బాధలు తేల్చుకోలేక ధన నష్టం జరిగే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులకు పని వత్తిడి పెరిగి ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడి శ్రద్ధ పెట్టి చదువుకోవడం మంచిది. ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్త.

పరిహారాలు:ఈరోజు రుణ విమోచన గణపతి స్తోత్రం పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి.

 

సింహరాశి:మిత్రలాభం పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రుల అయ్యే అవకాశం ఉంది. మిత్రలాభం పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. వివాహాది నిశ్చయతాంబూలాలకు అనుకూలమైన రోజు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని ఉత్తమ విద్యార్థుల పేరు పొందుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంది. ధన లాభం పొందే అవకాశం ఉంది. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆదరించే అవకాశం ఉంది. గతంలో చేసిన తప్పులను తిరిగి సరిదిద్దుకునే అవకాశం ఉంది.

పరిహారాలు:హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. ఎంత కష్టమైన పనినైనా సులువుగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంది అనారోగ్యాన్ని తగ్గించుకొని సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వివాహాది సంబంధ విషయాలకు అనుకూలమైన రోజు. కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఆఫీసులలో అనుకున్న స్థానాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజంతా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది.

పరిహారాలు:ఈరోజు శ్రీ భ్రమరాంబికాష్టకము పారాయణం చేసుకోండి.

 

తులారాశి:పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. భార్యాభర్తలు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో ఉన్నత స్థానాలను పొందే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొంతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులు చేయకుండ ఉండి మొండి బాకీలు వసూలు చేసుకుని లాభం పొందుతారు.

పరిహారాలు:ఈరోజు శ్రీ వెంకటేశ్వర గోవింద నామ స్మరణం పారాయణం చేసుకోండి.

 

  వృశ్చిక రాశి:స్వల్ప నష్టాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. ఏ విషయంలో ఆయన తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని కష్టపడి చదువుకోవడం మంచిది. ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. చెప్పుడు మాటలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది, స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. తక్కువ మాట్లాడడం మంచిది.

పరిహారాలు:ఈరోజు కాలభైరవాష్టకం పారాయణం చేసుకోండి, పేదవారికి రొట్టెను దానం చేసుకోండి.

 

ధనస్సు రాశి:ఈరోజు పోటీపరీక్షల్లో విజయం !

ఈరోజు బాగుంటుంది. వ్యాపారం నీ విస్తరించుకొని ధన లాభం పొందే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో బాగుంటుంది. గతంలో ఉన్న అనారోగ్యాన్ని తగ్గించుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. క్రొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. వస్తు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. సోదరులతో కలిసిమెలిసి సఖ్యతగా ఉంటారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును, ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.

పరిహారాలు:ఈరోజు శివ అష్టకం పారాయణం చేసుకోండి.

 

 మకర రాశి:ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు !

ఈరోజు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉత్తమ విద్యార్థులుగా పేరు పొందే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టి విశేషమైన ధనలాభం పొందే అవకాశం ఉంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

పరిహారాలు:ఈరోజు చంద్రశేఖర అష్టకం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి:ధన లాభం !

ఈరోజు బాగుంటుంది. దైవ కృప వల్ల వల్ల కష్టాల్లో నుంచి బయట పడే అవకాశం ఉంది. వాహన ప్రమాదాల నుంచి తప్పుకునే అవకాశం ఉంది, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ధన లాభం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వలన లాభాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంది అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. గృహన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

పరిహారాలు:ఈరోజు అన్నపూర్ణ అష్టకం పారాయణం చేసుకోండి.

 

 మీన రాశి:ఈరోజు ప్రేమికుల మధ్య విభేదాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలకు దూరంగా ఉండడం మంచిది. అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. ప్రేమికుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. దైవ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు పని వత్తిడి పెరిగి  మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశం  ఉంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి కష్టపడి చదువు కోవడం మంచిది.

పరిహారాలు: ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news