జనవరి 29 శుక్రవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

జనవరి –  29 – శుక్రవారం – పుష్యమాసం.

మేష రాశి: ఈరోజు ప్రయాణాలు వాయిదా !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది, స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ వాహనాలను ఎవరికి ఇవ్వకపోవడం మంచిది, ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఏ విషయంలోనైనా తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

పరిహారాలుః ఈరోజు లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేసుకోండి.

todays horoscope

వృషభ రాశి: ఈరోజు గృహంలో శుభకార్యాలు !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. అందరితో కలిసి మెలిసి ఉంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వలన ధన లాభం పొందే అవకాశం ఉంది. మొండి బకాయిలు వసూలు చేసుకొని ధన లాభం పొందుతారు. శత్రువులకు దూరంగా ఉంటారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. గృహంలో శుభకార్యాలు తలపెట్టే అవకాశం ఉంది.

పరిహారాలుః ఈరోజు శ్రీ కృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి: ఆహార విషయంలో జాగ్రత్త !

ఈరోజు అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బయటి వ్యక్తులతో పరిచయాలు పెట్టుకోవడం మంచిది కాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపడం మంచిది, ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సోదరులతో కలిసి మెలిసి ఉండడం మంచిది. ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. విద్యార్థులు అనవసర విషయాలను వదిలేసి చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

పరిహారాలుః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి 11 నవగ్రహ ప్రదక్షిణలు చేయడం మంచిది అంతా శుభప్రదమే.

 

కర్కాటక రాశి: అప్పుల బాధలు పోతాయి !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉత్తమ మార్కులను పొందుతారు. అప్పుల బాధలు పోతాయి. ధన లాభం పొందుతారు వ్యాపారంలో క్రొత్త పెట్టుబడులు పెట్టడం వలన, వ్యాపారాన్ని విస్తరించడం వలన అధిక లాభాలు పొందుతారు, నిరుద్యోగులకు ఉద్యోగం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఉద్యోగులం ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థకు మారే అవకాశం ఉంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు లాభాలను కలిగిస్తాయి. ఇంతకుముందు భార్యాభర్తలు విభేదాలు ఉన్న వారు తిరిగి అన్యోన్యంగా ఉంటారు. రోజంతా ప్రశాంతంగా ఉంటారు.

పరిహారాలుః ఈ రాజ్యం కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి: కోపాలకు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది !

ఈరోజు కష్టంగా ఉంటుంది. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. నష్టం జరిగే అవకాశం ఉంది. అర్హతలు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. అప్పులు తీసుకోవడం, ఇవ్వడం చేయకుండా ఉండటం మంచిది. కోపాలకు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. మీ రహస్యాలను బయట చెప్పడం చేయకుండా ఉండటం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. క్రొత్త వ్యాపారాలను ప్రారంభించక పోవడం మంచిది. ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. తక్కువ మాట్లాడడం మంచిది.

పరిహారాలుః ఈరోజు సంకష్టహర గణపతి స్తోత్రం పారాయణం చేసుకోండి. గణపతికి ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించండి, అంతా శుభ ఫలితాలు ఫలితాలు కలుగుతాయి.

 

కన్యారాశి: ఈరోజు ఆనందంగా ఉంటారు !

ఈరోజు ఆనందంగా ఉంటారు. మొండి బకాయిలను వసూలు అవుతాయి. ధనయోగం పొందే అవకాశం ఉంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. నిరుద్యోగలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వలన ధన లాభం కలిగే అవకాశం ఉంది. ప్రయాణాలు కలిసి వస్తాయి, తీర్థయాత్రలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు బ్రమరాంబికాష్టకం పారాయణ పారాయణ చేసుకోండి.

 

తులారాశి: నూతన గృహాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం పరీక్షలు వ్రాసే వాళ్ళు విజయం పొంది ఉద్యోగం పొందుతారు. అనవసర ఖర్చు చేయకండి. ధనయోగం పొందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. భార్యభర్తలు ఇద్దరు సఖ్యతగా ఉంటారు. పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది. ఇంతకుముందు పోగొట్టుకున్న వస్తువులను ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. నూతన గృహాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

పరిహారాలుః ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేయండి.

 

వృశ్చిక రాశి: అధిక లాభాలు కలిగే అవకాశం !

ఈ రోజంతా శుభ యోగం. శత్రువులు కూడా మిత్రుల అవకాశం వుంది. ధనయోగం పొందే అవకాశం ఉంది. తొందరపాటుతనం తగ్గించుకోవడం మంచి జరుగుతుంది. ఏ పని చేసిన విజయం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో అధిక లాభాలు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వాక్చాతుర్యం వల్ల అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. స్థిరాస్తి లను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు కుబేరుని ఆరాధన చేయండి.

 

ధనస్సురాశి: శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి, వల్ల ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు. విద్యార్థులం అనవసరపు విషయాలను పట్టించుకోకుండా ఉండాలి. కష్టపడి చదువు కోవడం మంచిది. ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి.

పరిహారాలుః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్వామి వారి ఆరాధన చేసుకోండి.

మకరరాశి: మొండి బకాయిలు వసూలు అవుతాయి !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ధనలాభం పొందుతారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ధన యోగం కలుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి పోటీపరీక్షల్లో ఉన్నత మార్కులు లేదా ర్యాంకులు సాధించే అవకాశం ఉంది. వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో అందరూ కలసి ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. వైవాహికంగా బాగుం టుంది.

పరిహారాలుః ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం తీసుకోండి.

 

కుంభరాశి: పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. శత్రువులను మీ వశం చేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు  కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. వ్యాపారాలను విస్తరించుకొని ధన యోగం పొందుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభాలు కలిగిస్తాయి. శుభకార్యాన్ని తలపెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో బాగుంటారు.

పరిహారాలుః ఈరోజు అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి: వ్యాపారాల్లో ధన లాభం వస్తుంది !

ఈరోజు భగవంతుని దయ కృప మీమీద ఉంటుంది. దీనివలన అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. ఇంతకుముందు విడిపోయిన భార్య భర్తలు తిరిగి కలిసి మెలిసి సంతోషంగా అన్యోన్యంగా ఉంటారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి. ధనయోగం పొందుతారు. వ్యాపారాల్లో ధన లాభం వస్తుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఆఫీస్‌లో పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషం, ముఖ్యవిషయాలపై నిర్ణయాలు తీసుకోంటారు. ఈ రోజంతా ప్రశాంతం గా, ఆనందంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

-శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news