తారక్ జపాన్ ఫ్యాన్స్.. ఈ సారి ఇరగదీసారుగా…

-

ఏ పాత్రయినా సునాయాసంగా చేయగల నటుల్లో ఎన్టీఆర్ ప్రథమ స్థానంలో ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. అటు నటనలోనూ, డాన్సుల్లోనూ తనదైన యూనిక్ నెస్ ఉంటుంది. ఐతే ఎన్టీఆర్ కి అభిమానులు చాలా ఎక్కువ. జపాన్ లో సైతం ఎన్టీఆర్ కి వీరాభిమానులు ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ పాటలకి కవర్ సాంగ్స్ చేస్తున్న ఒక జపాన్ జంట, తాజాగా మరో కొత్త కవర్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాన్నకు ప్రేమతో సినిమాలోని లవ్ దెబ్బ పాటకి జపాన్ జంట అద్భుతంగా డాన్స్ చేసింది.

సేమ్ కాస్ట్యూమ్స్, సేమ్ స్టెప్పులతో ఇరగదీసారనే చెప్పాలి. ఇంట్లోనే ఉండి ఇంత సీరియస్ గా ఎన్టీఆర్ పాటలకి కవర్ సాంగ్స్ చేస్తూ, తనకి ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానమో చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమరం భీమ్ గా కనిపిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా లైన్లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news