దేవరకొండ ఫ్యామిలీ కోసం రంగంలోకి దిగిన ‘జంబలకడి జారుమిఠాయ ఆంటీ’ !

-

హృదయకాలేయం డైరెక్టర్‌ సాయిరాజేశ్‌ చేస్తున్న కొత్త సినిమా బేబి. ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్‌ లో నటిస్తున్నారు.ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. మాస్‌ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ బల్గానిన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సారి సాయి రాజేశ్ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకుని ‘బేబీ’ సినిమాను రూపొందించాడు. అయితే… ఈ సినిమా టీజర్ నిన్న నే రిలీజ్‌ అయింది.

అయితే.. ఈ సినిమాను ఎక్కువగా ప్రమోట్‌ చేయడానికి.. జారుమిఠాయి ఆంటీని వాడేసుకున్నారు. ఇందులో భాగంగానే.. “బేబీ టీజర్ వస్తుంది చూడు, ఒక్కసారి చూసావంటే మళ్ళీ మళ్ళీ చూస్తావు చూడు జంకలకడి జారు మిఠాయా, నువ్వు చూడకుంటే ఒప్పుకోను మొగ్గలకళింగొ జంకలకడి జారు మిఠాయా” అంటూ ఆ మహిళ పాడిన పాటతో బేబీ టీజర్ ను ప్రమోట్ చేస్తున్నారు.

ఆమెతో పాట పాడించి రికార్డు చేసిన వీడియోను సాయి రాజేష్ ట్వీట్ చేశాడు. ఇందులో ఆనంద్ దేవరకొండ మీద ఒక లైన్ పాడించారు. “మన చిన్న కొండ తోపు దమ్ముంటే ఆపు, బేబీ టీజర్ చూశావంటే ఊపేస్తవు చూడు జంకలకడి జారు మిఠాయా” అని పాడించి సోషల్ మీడియాలో అందరిని ఆకర్షించారు. ఈ పాట చూసిన వాళ్లంతా ఆడియన్స్ పల్స్ పట్టేశారు అంటూ సాయి రాజేష్ ను పొగుడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news