వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పురన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ కు రాజీనామా చేశాడు. టి20 ప్రపంచకప్ లో గోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ విండీస్ కెప్టెన్సీ పూరన్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
కాగా, ఈ ఏడాది కిరణ్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో పూరన్ సారధిగా ఎంపికయ్యాడు. కెప్టెన్ గా ఎంపికైన పురన్ జట్టును విజయపంతంలో నడిపించలేకపోయాడు. అంతేకాకుండా వ్యక్తిగత ప్రదర్శనలో కూడా తీవ్ర నిరాశపరిచాడు. ముఖ్యంగా టి20 ప్రపంచ కప్ లో ఐర్లాండ్, స్కాట్లాండ్ వంటి పసికోన చేతిలో ఓడి అవమానకర రీతిలో టోర్నీ నుంచి విండీస్ నిష్క్రమించింది. ఈ నేపథ్యంలోనే, విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకు రాజీనామా చేశాడు.