ఇటీవలే ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో క్రికెట్ అభిమానులు ప్లేయర్లకు చెందిన కళ్లు చెదిరే ప్రదర్శనలు చూశారు. ప్లేయర్లు ఆడిన షాట్లు, తీసిన వికెట్లు, పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌లను చూసి మైమరిచిపోయారు. అయితే ఐపీఎల్ ముగిసినప్పటికీ క్రికెట్ వినోదానికి అంతు లేదు కదా. అందులో ఎప్పుడూ ప్లేయర్లు అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ కూడా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతంగా క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు.
జేసన్ హోల్డర్ హైట్ 6 అడుగుల 7 ఇంచులు. అందుకనే అతను అంతటి అద్భుతమైన క్యాచ్ పట్టగలిగాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 43వ ఓవర్‌లో విండీస్ బౌలర్ షానన్ గేబ్రియల్ వేసిన బంతి కివీస్ ప్లేయర్ విల్ యంగ్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుంది. బంతి స్లిప్‌లోకి వెళ్లింది. అక్కడే నిలుచుని ఉన్న జేసన్ హోల్డర్ తన కుడి వైపుకు చేయిని వీలున్నంత వరకు చాచి ఒక్క చేత్తోనే క్యాచ్ పట్టాడు. దీంతో కామెంటేటర్లు సైతం ఆశ్చర్యపోయారు. అతను అంతలా హైట్ ఉండడం వల్ల ఆ క్యాచ్ పట్టడం సాధ్యమైందని వారన్నారు.
Stunning catch from West Indies skipper Jason Holder.#NZvWI pic.twitter.com/K8TWjhXH96
— Nic Savage (@nic_savage1) December 11, 2020
కాగా జేసన్ హోల్డర్ పట్టిన ఆ క్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 84 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగుల స్కోరు వద్ద కొనసాగుతోంది. కాగా సిరీస్‌లో మొదటి టెస్టు మ్యాచ్‌లో కివీస్ ఘన విజయం సాధించింది.