టీటీడీ ఈవోగా నియమించబడిన జవహర్ రెడ్డి ఈ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 నుంచి 01 గంట మధ్య ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు జవహర్ రెడ్డి. ఈ సందర్భంగా జవహర్ రెడ్డికి సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది వీడ్కోలు పలికారు. ఈ సంధర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం చేసుకునే అవకాశం ఇన్నాళ్లుకు దక్కిందని అన్నారు.
తిరుపతిలో కొన్నాళ్లు విద్యాభ్యాసం చేశానన్న ఆయన వైద్యారోగ్య రంగాన్ని సీఎం జగన్ కొత్త పుంతలు తొక్కిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం వైద్యారోగ్య రంగంలో జరుగుతున్న పనులకు చక్కటి ఫలితాలు వస్తాయని అన్నారు. వైద్యారోగ్య శాఖలో నాడు-నేడు కార్యక్రమం ఒక ట్రెండ్ సెట్టర్ అన్న ఆయన ఈ మహత్తర కార్టక్రమంలో నేను భాగస్వామ్యం కావడం సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. కరోనా కాలంలో జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో ప్రధాన కార్యదర్శిగా పని చేసారు. కరోనా కట్టడిలో ఆయన ముందు నుంచి కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. కరోనా పరీక్షలను పెంచే విషయంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.