అరుదైన గౌరవం దక్కించుకున్న జయప్రద..!

-

80 లలో అత్యంత ప్రావీణ్యం పొందిన హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారు అంటే వారిలో శ్రీదేవి, జయప్రద లాంటి వాళ్ళ పేర్లు మొదటగా వినిపిస్తాయి. అందాల ముద్దుగుమ్మలుగా వీరిద్దరూ అందం విషయంలో పోటీపడి మరి నటించేవారు. అంతలా అభిమానులను కూడా సొంతం చేసుకున్న వీరు ఎప్పటికీ కూడా శత్రువులు గానే మిగిలిపోవడం జరిగింది. ఇదిలా ఉండగా జయప్రద ప్రస్తుతం రాజకీయాలలో రాణిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈమె ఖాతా లో ఒక అరుదైన విశిష్ట పురస్కారం వచ్చి చేరింది. గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్విఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించగా ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.

మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమంలో అలనాటి నటి జయప్రద కు ఎన్టీఆర్ పురస్కారాన్ని అందించారు.. మేళ తాళాలు..వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య జయప్రదకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన నిర్వహకులు.. ఆ తర్వాత ఘనంగా సత్కరించారు. నందమూరి రామకృష్ణ చేతుల మీదుగా జయప్రదకు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని అందజేయడం జరిగింది.. ముఖ్యంగా జయప్రద తో పాటు పలువురికి ఎన్టీఆర్ అవార్డులతో సన్మానించడం గమనార్హం.

అలాగే డాక్టర్ మైథిలి అబ్బరాజుకి ఎన్టీఆర్ అభిమాన అవార్డు అందజేశారు. ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర ఉత్సవాల్లో సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి అర్పించారు. ఆ తర్వాత అతిధులు, ప్రజలు అందరూ కలిసి కొన్ని నిమిషాల పాటు మౌనం పాటించి.. కృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి అర్పించారు. అంతేకాదు రచయిత సాయి మాధవ్ బుర్ర సభ నిర్వహణలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరిగింది . ఇదిలా ఉండగా ఈనెల 28న అడవి రాముడు మూవీ ప్రదర్శించనున్నారు.. ముఖ్యంగా డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి తో పాటు జయప్రద ,ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ ఈ సినిమాను అభిమానులతో కలిసి వీక్షించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news