తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు ముందే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. జగన్ మీ తమ్ముడా, కొడుకా అంటూ ప్రశ్నించారు. ఆయన ఎలాంటి వాడో మీకు పామిడి బహిరంగ సభలో చెప్పాను అన్నారు. మా వాడి సంగతి మీకు తెలియదు అన్నారు. తనకు వైఎస్ తో ఉన్న సంబంధంతో జగన్ ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్నారు. రెండేళ్ళ క్రితమే తాను చెప్పాను అన్నాడు… వైఎస్ లో ఉన్న పది శాతం కూడా మంచి గుణాలు జగన్ లో లేవని చెప్పినట్టు గుర్తు చేసారు…
ఒక సందర్భంలో… జగన్ కి డీజీ సెల్యూట్ చేయడానికి వస్తే… ప్రమాణ స్వీకారం చేయక ముందు… జగన్… డీజీకి చంద్రబాబుని లోపల వేయమని చెప్పారని… అప్పుడు సెల్యూట్ చేయమని చెప్పారట… చంద్రబాబు శాంతి శాంతి అని చెప్పి సంకనాకిచ్చారని చంద్రబాబు ముందే విమర్శించారు. పోలీసులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు… ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఉన్నా సరే పోలీసులను వదిలిపెట్టేది లేదని… బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని… తాను మంత్రిగా ఉన్నారని… ఎలా చెయ్యాలో తనకు చెయ్యాలన్నారు…
తాను చంద్రబాబుకి చెప్పాను ఎమ్మెల్యేలను మార్చాలని వినలేదని అన్నారు… చంద్రబాబు ఇక శాంతి వచనాలు వద్దని సూచించారు… తాను నమ్ముతున్నాను అని రెండున్నర ఏళ్ళలో ఎన్నికలు వస్తాయని అన్నారు. తమ కస్టాలు చాలా దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు… చప్పట్లు కొట్టే వాళ్ళని ఆదరించారని… ముఖ్యమంత్రిగా కోరుకున్న వాళ్ళను ఆదరించాలేదని విమర్శించారు. సమీక్షలు చేసి చంద్రబాబు నాశనం చేసారని అన్నారు… ఒక్కసారి కూడా చంద్రబాబు తమ బాధలు వినలేదన్నారు.