జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్..!

-

తాడిపత్రి: జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డిగా రాజకీయం మారింది. అక్రమ నిర్మాణాల తొలగింపుతో వీరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. కక్ష పూరితంగా కూల్చివేతలు చేపట్టారని జేసీ ప్రభాకర్ అంటుంటే ప్రభుత్వ భవనాలను కబ్జా చేస్తారా అంటూ పెద్దారెడ్డి ప్రశ్నిస్తున్నారు. దీంతో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇది కాస్త తాడిపత్రి మున్సిపాలిటీకి చేరింది.

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో 18 మంది టీడీపీ కౌన్సిలర్లు గెలవగా 16 మంది వైసీపీ కౌన్సిలర్లు విజయం సాధించారు. మరొకరు ఇండిపెండెంట్ కాగా ఇంకొకరు సీపీఎం కౌన్సిర్లు. వీరిద్దరు టీడీపీకి మద్దతు పలకడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఛైర్మన్ అయ్యారు. వైస్ ఛైర్మన్‌గా టీడీపీ కౌన్సిలరే ఎన్నికయ్యారు. ఇప్పుడు తాజాగా రెండో వైస్ చైర్మన్ కూడా టీడీపీనే దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గం అధిపత్యం కోసం ప్రయత్నం చేస్తోంది. టీడీపీ కౌన్సిలర్లకు సంబంధించిన కేసులు, నిర్మాణాల చిట్టాను బయటకు తీశారు. వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు గట్టు దిగి వైసీపీలో చేరతారనేది పెద్దారెడ్డి భావన.

 

దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి అప్రమత్తమయ్యారు. కౌన్సిలర్లు జంప్ కాకుండా క్యాంపు పాలిటిక్స్ కు తెర తీశారు. తనను ఛైర్మన్ పదవి నుంచి దింపాలనుకుంటే అదంత ఈజీ కాదని, మరో మూడేళ్ల 8 నెలల పాటు తనను ఎవరూ టచ్ చేయలేరని జేసీ ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేయడమే కాదు సవాల్ కూడా చేశారు మరి ఇందుకు పెద్దారెడ్డి కౌంటర్ ఎలాగుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news