మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి ప్రతి ఒక్కరకి తెలుసు. అయితే ఆల్కహాల్ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం ఉండదు అని అంటున్నారు నిపుణులు. రోజుకి మహిళలు ఒక డ్రింక్, పురుషులు రెండు డ్రింకులు తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.
ఒక డ్రింక్ అంటే 12 ఔన్సుల బీరు లేదా 5 ఔన్సుల వైన్ లేదా 1.5 ఔన్సుల లిక్కర్ అయినా తీసుకోవచ్చు. అయితే అవసరమైనంత మోతాదులో తీసుకుంటే మంచిది. కానీ పరిమితి దాటి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం కలగదు. అయితే ఈ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది చూద్దాం.
మానసిక ఆరోగ్యానికి మంచిది:
శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇలా తగినంత మోతాదులో ఆల్కహాల్ ని తీసుకోవడం వల్ల ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. మానసిక సమస్యలు కూడా ఉండవు .
హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ తగ్గుతుంది:
హృదయ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. తగినంత మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
జీవితకాలం పెరుగుతుంది:
ఆల్కహాల్ తాగడం వల్ల జీవితకాలం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తగినంత మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జీవితకాలం పెరుగుతుంది.
కిడ్నీ స్టోన్స్ ఉండవు:
తగినంత మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు రాకుండా చూసుకుంటుంది. అయితే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ అయిపోయి కిడ్నీ స్టోన్స్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అయితే గర్భిణీలు ఆల్కహాల్ తీసుకోకూడదు. అదే విధంగా లివర్ సమస్యలు ఉండే వాళ్ళు కూడా ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిది.