అనేక ఊహాగానాలు, ఉద్రిక్త పరిస్థితుల మధ్య తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంపిక అయ్యారు. అలానే తాడిపత్రి వైస్ చైర్ పర్సన్ గా పి.సరస్వతి ఎంపికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అలా మొత్తం మీద జేసీ ప్రభాకర్ రెడ్డి పంతం నెగ్గించుకున్నట్టు అయింది. అయితే తాము నైతిక విలువలు పాటించామని వైసీపీ నేతలు పేర్కొన్నారు. నిజానికి ఇక్కడ జరిగిన ఎన్నికల్లో మొత్తం 36 వార్డుల్లో వైసీపీకి 16, టీడీపీకి 18, సీపీఐ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచారు.
ఇక్కడ చైర్మన్ స్థానం చేజిక్కించుకోవాలంటే 19 మంది బలం అవసరం. ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫిషియో ఓట్లు కలిపితే వైసీపీ బలం 18కి చేరింది. దీంతో సీపీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థి కీలకంగా మారారు. ఇప్పటికే టిడిపికి సీపీఐ మద్దతు తెలిపింది. టిడిపి క్యాంపులో సీపీఐ అభ్యర్థి సహా ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఉండడంతో ఆయన కూడా టీడీపీకి మద్దతు పలికారు. దీంతో ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.