జేఈఈ మెయిన్స్‌లో టాప్ 2.5 లక్షలలోపు ర్యాంకు సొంతం చేసుకున్నవారు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తారు..జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 11గా నిర్ణయించారు. కాగా, జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పరీక్ష ఆగస్టు 28న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బొంబాయి చేపట్టనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించనున్న సంగతి తెలిసిందే..
వీటికి అవసరమైన డాక్యుమెంట్స్..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసే సమయంలో అవసరమైన పత్రాలు ఇవే..
10వ తరగతి సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికెట్
12వ తరగతి లేదా అందుకు సమానమైన పరీక్ష సర్టిఫికెట్లు
కేటగిరి, పీడబ్ల్యూడీ లేదా డీఎస్ సర్టిఫికేట్ (వర్తిస్తే)
స్క్రైబ్ లెటర్ (వర్తిస్తే)
పీఐఓ కార్డ్ లేదా ఓసీఐ సర్టిఫికేట్(అవసరమైతే)..
దరఖాస్తు విధానం:
అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.inను సందర్శించాలి
జేఈఈ మెయిన్ -2022 అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ వంటి లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
ప్రాథమిక వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయండి.
స్పెసిఫికేషన్స్ ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి..
అప్లికేషన్ ఫీజును చెల్లించండి..
వివరాలను ప్రివ్యూ చూసిన తరువాత అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయండి..
ఈ పరీక్షల కోసం మహిళా అభ్యర్థులు రూ.1400, ఎస్సీ, ఎస్టీ, పీడబ్లూడీ అభ్యర్థులతో పాటు ఇతరులు రూ.2,800 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. JEE అడ్వాన్స్‌డ్-2022 పరీక్ష ఆగస్టు 28న నిర్వహించనున్నారు.. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరగనుంది. అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరు కావాలి…
జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. రెండు లాంగ్వేజ్‌లైన హిందీ, ఇంగ్లిష్‌లో మొత్తంగా ఆరు గంటల పాటు పరీక్ష జరుగుతుంది. ప్రతి ఏడాది మార్కింగ్ స్కీమ్ మారుతూ ఉంటుంది. తప్పు సమాధానాలకు నెగటివ్ మార్క్స్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇది కొన్ని ప్రశ్నలకు మాత్రమే ఉండవచ్చు. మార్కింగ్ స్కీమ్ వివరాలు ‘ఇన్‌స్ట్రక్షన్ టూ క్యాండిడేట్స్’ సెక్షన్‌లో పరీక్ష సమయంలో అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు..ప్రతి పేపర్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనే మూడు భాగాలు ఉంటాయి..
జేఈఈ అడ్వాన్స్‌డ్ జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. జాయింట్ అడ్మిన్ బోర్డు ఆధ్వర్యంలో ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ గౌహతి, ఐఐటీ రూర్కీ లలో ఐఐటీలు లేదా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహిస్తారు..