రేపే జేఈఈ మెయిన్ దరఖాస్తు చివరి తేదీ.. అప్లై చేసుకోండిలా..!

-

ఏప్రిల్ నెలాఖరీలో నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షకు రేపటితో దరఖాస్తు ముగియనుంది. రిజిస్ట్రేషన్ విండోను రేపు రాత్రి 11.50 గంటలకు మూసివేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. ఇలాంటి పరిస్థితిలో ఇప్పటివరకు జేఈఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోని వాళ్లు ఎవరైనా ఉంటే రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని హెచ్చరిస్తోంది. విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ nta.nic.in లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. జేఈఈ అప్లై చేసుకోవడానికి ఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి చివరితేదీ 2021 ఏప్రిల్ 5వ తేదీ వరకు ఉందని, విద్యార్థులు తొందరగా దరఖాస్తు చేసుకోవాలని ఎన్‌టీఏ తెలిపింది.

జేఈఈ వెబ్‌సైట్

జేఈఈ మెయిన్ ఫారమ్ నింపండిలా..
ఏప్రిల్‌లో జరిగే జేఈఈ మెయిన్ పరీక్షా ఫారమ్ నింపడానికి మొదటగా అభ్యర్థులు NTA JEE jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత హోం పేజీలో అందుబాటులో ఉన్న జేఈఈ మెయిన్ 2021 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో మొదటగా మీ వివరాలు నమోదు చేసుకుని రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత రిజిస్టర్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చ కోడ్‌తో లాగిన్ అవ్వాలి. అప్పుడు ఒక కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ ఫారమ్‌లో విద్యార్థులు దరఖాస్తు ఫారమ్ నింపాలి. ధ్రువపత్రాలు, ఫోటోలు అప్లోడ్ చేయాలి. పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత పరీక్ష ఫీజు చెల్లించాలి. దీని తర్వాత దరఖాస్తు సమర్పించబడింది. ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని హార్డ్ కాపీని భద్రపరచుకోవాలి.

కాగా, ఎన్‌టీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2021, మార్చి 25వ తేదీన ప్రారంభమైంది. ఆ సమయంలో బీబీటెక్ పేపర్-1, ఏప్రిల్ (సెషన్-3) పరీక్షలు నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్ పరీక్ష ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో నిర్వహించబడుతుంది. రెండు షిప్ట్‌ల ఆధారంగా పరీక్షలు జరుగుతాయి. మొదటి షిప్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ షిప్ట్ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు జరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version