నటి జాన్వి కపూర్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరతో మెప్పించబోతున్నారు. పుట్టినరోజు సందర్భంగా తెలుగులో నటించే మరో సినిమా గురించి అఫీషియల్ గా చెప్పారు. బుచ్చిబాబు సనా రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది మార్చి 7 న జాన్వి బర్త్డేని గ్రాండ్గా సపరేట్ చేసుకున్నారు.
దేవర టీం జాన్వి స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేశారు పట్టుచీరలో హెయిర్ లీవ్ చేసుకుని కొంటె చూపు చిన్న నవ్వుతో ఈయన చాలా అందంగా కనపడుతుంది. చూడడానికి అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంది. జాన్వి కపూర్ కట్టుకున్న చీర చాలా బాగుంది దీంతో ప్రతి ఒక్కరు కూడా ఆ చీర గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. చాలా ఓల్డ్ మోడల్ అయినా కూడా జాన్వికి చాలా బాగా సెట్ అయింది శ్రీదేవి చీర అయ్యి ఉండొచ్చు అని అంతా అంటున్నారు దేవరలో జాన్వి ఒక సాంగ్ లో ఈ చీరతోనే కనపడబోతున్నట్లు టాక్ కూడా వినపడుతోంది.