రాంగోపాల్ వర్మ రాజకీయాల మీద ట్విట్టర్లో పోస్టులు పెడుతూ ఉంటారు. ఎప్పుడు వివాదాల్లో ఉంటుంటారు. తను తీయబోయే వెబ్ సిరీస్ శపధం పై ట్విట్టర్ వేదికగా పోస్టర్లు విడుదల చేశారు ఈ పోస్టర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద సెటైరికల్ గా ఉంది ఈ పోస్టర్లో జనసేన జెండా పట్టుకున్న చిన్న పిల్లలకి పవన్ కళ్యాణ్ కింద కూర్చుని ఉపదేశం ఇస్తున్నట్లు ఉంది.
శపథం వెబ్ సిరీస్ చాప్టర్ వన్ ఏపీ ఫైబర్ నెట్ లో విడుదల అవుతుందని పోస్టర్ ద్వారా తెలిపారు సోమవారం కూడా ఇదే తరహా లో శపధం వెబ్ సిరీస్ కి సంబంధించి రెండు పోస్టర్లని విడుదల చేయడం జరిగింది. ఏపీ లో ఎన్నికల హడావిడి జోరుగా నడుస్తుండడంతో ఆర్జీవి వరుసగా విడుదల చేస్తున్న ట్వీట్ పోస్టర్లు హీట్ ని పెంచుతున్నాయి.