జాన్వీ కపూర్ ఆటోగ్రాఫ్ తీసుకున్న జక్కన్న..షాక్ లో ఇండస్ట్రీ..!

-

తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30.. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నిన్న ఉదయం పూజా కార్యక్రమాలతో చాలా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళితో పాటు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. అలాగే రాజమౌళి ఆమెతో ప్రత్యేకంగా ముచ్చటించి, ఆ తర్వాత ఆమె ఆటోగ్రాఫ్ తీసుకోవడంతో అక్కడున్న వారే కాదు ఇండస్ట్రీ కూడా షాక్ లో మునిగిపోయింది.

గ్లోబల్ స్టార్ అయ్యుండి.. ఒక యంగ్ హీరోయిన్ ఆటోగ్రాఫ్ తీసుకోవడం ఏంటి? అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే జాన్వి కపూర్, రాజమౌళి ప్రత్యేకంగా మాట్లాడుకొని.. ఏవో పేపర్ల పైన జాన్వి సంతకం పెట్టడం చూసి వీరిద్దరి మధ్య సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని వార్తలు వినిపించాయి. కానీ రాజమౌళి మాత్రం తన కూతురు మయూఖ కోసం జాన్వీ కపూర్ ఆటోగ్రాఫ్ తీసుకున్నారట. మయూఖ జాన్వికి వీరాభిమాని కావడంతో ఎన్టీఆర్ 30 మూవీ లాంచ్ కి వెళ్తున్న తన తండ్రి రాజమౌళిని జాన్వి ఆటోగ్రాఫ్ తీసుకు రమ్మని కోరిందట.

అందుకే కూతురు కోరిక మేరకు రాజమౌళి జాన్వీ కపూర్ ఆటోగ్రాఫ్ తీసుకున్నారట. ఏది ఏమైనా రాజమౌళి లాంటి గ్లోబల్ డైరెక్టర్ ఒక యంగ్ హీరోయిన్ అయినా జాన్వి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న ఫోటోలుగా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news