కరోనా నుండి కోలుకున్న మరుసటిరోజే కన్నుమూసిన జార్ఖండ్ మంత్రి..

-

మనదేశంలో కరోనా రికవరీ రేటు బాగానే ఉంది. మిగతా దేశాలతో పోలిస్తే రికవరీ రేటు ఇండియాలోనే ఎక్కువగా ఉంది. ఐతే కరోనా నుండి రికవరీ అయ్యాక జార్ఖండ్ మంత్రి హాజీ హుస్సేన్ అన్సారీ కన్నుమూసాడు. శుక్రవారం కరోనా నుండి కోలుకున్న మంత్రి శనివారం కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందాడు. సెప్టెంబర్ 26వ తేదీన కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించిన మంత్రి, ట్విట్టర్ ద్వారా ప్రకటించి మరికొద్ది రోజుల్లో ఆరోగ్యంగా తిరిగి వస్తానని చెప్పాడు.

శుక్రవారం కరోనా నెగెటివ్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు. కానీ అనుకోకుండా శనివారం కార్డియాక్ అరెస్ట్ కారణంగా కన్ను మూసారు. జార్ఖండ్ మైనారీటీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన హజీ హుస్సేస్ అన్సారీ 73ఏళ్ల వయసులో కరోనా నుండి రికవరీ అయ్యి మరీ మృతి చెందారు. ఐతే వైద్యుల చెప్పిన దాని ప్రకారం మంత్రిగారికి ఇతర ఇబ్బందులు కూడా ఉండేవట. బీపీ కారణంగా ఇలా అయ్యుండవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news