వ్యూయర్స్​కు షాక్.. జియో సినిమాకు ఇక డబ్బులు.. IPL మాత్రం ఫ్రీ

-

జియో సినిమా యాప్ తన వ్యూయర్స్ కు షాక్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఐపీఎల్ మ్యాచులకు కాకుండా మిగతా కంటెంట్ కు ఛార్జీలు వసూల్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కొత్తగా కంటెంట్‌ యాడ్‌ చేశాక.. ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించినట్లు రిలయన్స్‌ మీడియా, కంటెంట్‌ బిజినెస్‌ ప్రెసిడెంంట్‌ జ్యోతి దేశ్‌పాండే తెలిపారు. అయితే, ఎంత మేర వసూలు చేయాలనేది ఇంత వరకు నిర్ణయించలేదని పేర్కొన్నారు.
ఐపీఎల్‌ మ్యాచ్‌లు మే 28తో ముగియనున్నాయి. ఆలోపే కొత్త కంటెంట్‌ను యాడ్‌ చేయాలని రిలయన్స్‌ భావిస్తోందని జ్యోతి దేశ్‌ పాండే తెలిపారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లను మాత్రం యథాతథంగా ఉచితంగా వీక్షించొచ్చని తెలిపారు. జియో సినిమాకు వసూలు చేసే మొత్తాన్ని అందుబాటు ధరలోనే ఉంచాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే దేశీయ కంటెంట్‌ను అందించాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రసారాలతో ఆదరణ పొందిన జియో సినిమాను  అతిపెద్ద స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా మార్చేందుకు రిలయన్స్‌ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 100కు పైగా సినిమాలు, టీవీ సిరీస్‌లను తన జియో సినిమా యాప్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. తద్వారా నెట్‌ఫ్లిక్స్‌, వాల్ట్‌ డిస్నీ వంటి అంతర్జాతీయ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లతో పోటీ పడాలని భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news