మీరు జియో క‌స్ట‌మ‌రా..? ఇత‌రుల‌కు రీచార్జి చేసి క‌మిష‌న్ పొందండిలా..!

-

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. జియో క‌స్ట‌మ‌ర్లు జియో పీవోఎస్ లైట్ (JioPOS Lite) అనే యాప్ ద్వారా ఇత‌ర జియో క‌స్ట‌మ‌ర్ల‌కు రీచార్జి చేసి.. ఆ మొత్తంపై క‌మిష‌న్ పొంద‌వ‌చ్చు. ఆన్‌లైన్‌లో రీచార్జి చేసుకోవ‌డం తెలియ‌ని వారికి ఈ విధానం ఎంత‌గానో ఉప‌యోగ ప‌డుతుంది. జియో క‌స్ట‌మ‌ర్లు ఎవ‌రైనా స‌రే.. ఈ యాప్ ద్వారా జియో పార్ట్‌న‌ర్ అయి క‌మిష‌న్ సంపాదించ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో స‌ద‌రు యాప్ లో వారు ఇత‌రుల‌కు చేసిన రీచార్జి వివ‌రాలు, వారికి అందిన క‌మిష‌న్ వివ‌రాల‌ను సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

jio customers now can recharge other jio customers and earn commission

ఇక జీయో పీవోఎస్ లైట్ యాప్ ప్ర‌స్తుతం కేవ‌లం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై మాత్ర‌మే అందుబాటులో ఉంది. త్వ‌ర‌లోనే ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై కూడా ఈ యాప్‌ను లాంచ్ చేయనున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగ‌దారులు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇక ఈ యాప్‌లో జియో క‌స్ట‌మ‌ర్లు త‌మ జియో ఫోన్ నంబ‌ర్ ద్వారా రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం యాప్‌లో ఉండే వాలెట్‌లో రూ.500, రూ.1వేయి, రూ.2వేలు ఇలా నిర్దిష్ట‌మైన మొత్తాన్ని లోడ్ చేయాలి. త‌రువాత ఇత‌ర జియో క‌స్ట‌మ‌ర్ల‌కు ఆ మొత్తం నుంచి రీచార్జి చేయ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో ఒక్కో రీచార్జికి 4.16 శాతం క‌మిష‌న్ ఇస్తారు. అంటే రూ.100 విలువైన రీచార్జికి రూ.4.16ను క‌మిష‌న్ రూపంలో పొంద‌వ‌చ్చు.

కాగా ఇప్ప‌టి వ‌ర‌కు జియో క‌స్ట‌మ‌ర్లు కేవ‌లం మై జియో యాప్ లేదా జియో వెబ్‌సైట్ ద్వారానే ఇత‌ర జియో క‌స్ట‌మ‌ర్ల‌కు రీచార్జి చేసే సౌల‌భ్యం ఉండేది. కానీ ఈ కొత్త యాప్‌తో ఇత‌ర జియో క‌స్ట‌మ‌ర్ల‌కు రీచార్జి చేయ‌డ‌మే కాదు.. దాని వ‌ల్ల ఎంచ‌క్కా క‌మిష‌న్ కూడా పొంద‌వ‌చ్చు. అలాగే ఎయిర్‌టెల్ కూడా ఎర్న్ ఫ్రం హోం పేరిట స‌రిగ్గా ఇలాంటి ఆఫ‌ర్‌నే అందిస్తోంది. అందులోనూ ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్లు ఎయిర్‌టెల్ యాప్ ద్వారా ఇత‌ర ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల‌కు రీచార్జి చేసి 4 శాతం క‌మిష‌న్ పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news